Connect with us

Associations

ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం అట్లాంటా చాప్టర్ అధ్యక్షునిగా చిల్లపల్లి నాగ తిరుమలరావు ఎన్నిక

Published

on

ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం జార్జియా రాష్ట్ర అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడుగా చిల్లపల్లి నాగ తిరుమలరావు ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం నూతన కార్యవర్గాన్ని నియమించారు. విజ్జు చిలువేరు గౌరవ సలహాదారుగా ఎన్నికయ్యారు. అదే విధంగా సతీష్ నందాల డైరెక్టర్ ఆపరేషన్స్ అడ్మిన్ గా, సుధాకర్ రావిరాల డైరెక్టర్ ఫైనాన్స్ గా, వెంకట్ చింతలపూడి డైరెక్టర్ యువజన గా, సువర్ణ ఆడెపు డైరెక్టర్ ఉమెన్ గా, మయూర్ మిట్టపల్లి డైరెక్టర్ ఈవెంట్ మేనేజ్మెంట్ గా ఎన్నిక కావడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తాటిపాముల, ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాబురావు సామల, ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం బోర్డ్ ఆఫ్ అధ్యక్షుడు శ్రీ చెరుకూరి విచ్చేసి నూతన కార్యవర్గాన్ని అభినందించారు. సంఘటిత శక్తిగా పద్మశాలీలు ఉండాలని బోధించారు.

అట్లాంటా పద్మశాలీలు ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఇదిలా ఉండగా అట్లాంటా చాప్టర్ ప్రారంభోత్సవ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. సేవాభావంతో నూతన కార్యవర్గం ముందుకు సాగుతుంది అన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పేరుపేరునా అభినందించడం జరిగింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected