Connect with us

Concert

మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అట్లాంటాలో మెగా సంగీత విభావరి

Published

on

కొణిదెల శివ శంకర వర ప్రసాద్! అందరూ అభిమానంగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదినం సందర్భంగా అట్లాంటా మెగా ఫాన్స్ సంగీత విభావరి ఏర్పాటుచేస్తున్నారు. కమ్మింగ్ నగరంలోని స్థానిక సెక్సటన్ హాల్లో ఈ నెల ఆగస్టు 22 సాయంత్రం నాలుగు గంటలనుండి పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అనిల్ బోదిరెడ్డి ప్రొడక్షన్స్ ప్రజంట్ చేస్తున్న ఈ విభావరిని క్వాలిటీ సిస్టమ్స్ ఎన్హాన్సమెంట్స్, వెంకట్ ఐనాబత్తిన మరియు నార్తీస్ట్ మోర్ట్గేజ్ చిన్మయ మంచల సమర్పిస్తున్నారు. బీట్స్ & ఈవెంట్స్ డీజే చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులు వెంకట్ చెన్నుభొట్ల, శిల్ప, వాహిని, అర్చన తదితరులు క్లాస్, మాస్, పాత క్లాసిక్స్, డ్యూయెట్స్ ఇలా అన్నిరకాల పాటలతో అలరించనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected