Connect with us

Music

ఆటా నాదం: విజయవంతంగా ముగిసిన పాటల పోటీలు

Published

on

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘ఆటా నాదం’ అంటూ పాటల పోటీలను ఆన్లైన్ లో జూమ్ ద్వారా నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఆటా మహాసభలు జరిపే ముందు, ప్రథమంగా రెండు తెలుగురాష్ట్రాలలో సంస్థ సేవాకార్యక్రమాలు చేపడుతుంది. ఆటా వేడుకల కార్యక్రమములో భాగంగా ప్రతిభావంతులైన యువ గాయనీగాయకులకు ఆటాలో ప్రత్యేకమైన వేదికను కలిపించాలనే సదుద్దేశముతో ‘ఆటా నాదం’ పాటల పోటీల కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. దాదాపుగా 200 మంది గాయనీగాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఈ పోటీలో పాల్గొన్నారు. ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల చైర్ మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు, సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల, పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి, పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో ఇరు తెలుగురాష్ట్రాలలో ప్రతిభఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

‘ఆటా నాదం’ పాటల పోటీలను అక్టోబర్ 23 న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి ఫైనల్స్ నవంబర్ 13 న ముగించింది. పదకొండు యువ గాయనిగాయకులు ఫైనల్ రౌండ్ లో పాల్గొనగా ప్రథమ స్థానంలో ప్రణతి కే , ద్వితీయ స్థానములో మేఘన నాయుడు దాసరి, తృతీయ స్థానములో వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల మరియు అభినవ్ అవసరాల గెలుపొందారు. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా, రవళి పరిటాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దర్శకులు ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకులు, ఎల్.ఎం.ఏ సంస్థాపకులు, ఆటా సంస్థ ఇండియా సాంస్కృతిక సలహాదారు రామాచారి కొమండూరి కార్యక్రమములో పాల్గొని గాయని గాయకులకు అభినందనలు తెలియచేసారు.

డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 25 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో మధు బొమ్మినేని, అధ్యక్షులు భువనేశ్ బూజల, పాలక మండలి సభ్యులు మరియు ఆటా కార్యవర్గ బృందంతో కలిసి విద్య, వైద్య, కమ్యూనిటీ సేవలు, స్త్రీ సంక్షేమ, బిజినెస్ సెమినార్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్ లాంటి వివిధ కార్యక్రమాలు వివిధ నగరాలలో, గ్రామాలలో నిర్వహించ బోతున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు మాతృదేశం కళాకారులతో రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహిచబోతున్నారు. విజేతలకు “ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26 న సాయంత్రం 7 గంటలకు జరిగే సాంస్కృతిక కార్యక్రములో పాడడానికి గొప్పఅవకాశం ఆటా సంస్థ కలిగిస్తుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected