తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) ఆధ్వర్యంలో 45 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘దివ్య దీపావళి’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీపావళి పండుగ సంబరాలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాలతో ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించారు.
ఆల్ఫారెటా (Alpharetta, Georgia) లోని దేశానా మిడిల్ స్కూల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ (Singer Sameera Bharadwaj), కార్తీక్ మల్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్ (Concert) ప్రేక్షకులను అలరించింది.
ప్రియా మాధవ్ (Priya Madhav) ఎంసీగా కార్యక్రమాన్ని నిర్వహించగా, అక్షయ్, జుబల్, బైదూరియా, షారన్, జయకర్ల సంగీత బృందం తమ ప్రదర్శనలతో సందడి చేసింది. కార్యక్రమంలో భాగంగా డైమండ్ రింగ్ రాఫిల్ నిర్వహించడంతో పాటు కుటుంబ సభ్యులు, పిల్లల కోసం పలు ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేశారు.
డిన్నర్, వివిధ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), రోబోటిక్స్, చెస్ వంటి విభిన్న అంశాలు వేడుకలో చోటుచేసుకున్నాయి. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించేలా TAMA నిర్వహించిన ఈ దీపావళి వేడుకలు అట్లాంటా తెలుగు సమాజానికి ప్రత్యేక వేడుకగా నిలిచాయి.
కార్యక్రమ నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు, కళాకారులు, కమ్యూనిటీ సభ్యులకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic), వాలంటీర్, రాయపురెడ్డి మెమోరియల్ అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా తామా అధ్యక్షులు సునీత పొట్నూరు (Suneetha Potnuru), ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) మహా టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) గత 45 సంవత్సరాలుగా అట్లాంటా ప్రాంతంలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోంది అని అన్నారు.
పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా నిర్వహించిన ‘దివ్య దీపావళి’ వేడుకలు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) సాంస్కృతిక సేవా ప్రస్థానానికి మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచాయి అని అన్నారు.
భారతీయ సంప్రదాయాలను అమెరికాలోని భావితరాలకు పరిచయం చేస్తూ, తెలుగు సమాజాన్ని మరింత చేరువ చేసే ఇటువంటి (Telugu Association of Metro Atlanta – TAMA) తరపున కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) ఆధ్వర్యంలో 45 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘దివ్య దీపావళి’ వేడుకలకు సంబంధించి మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TAMA Diwali 2026 ని సందర్శించండి.