రాబోయే హాలిడేస్ సీజన్‌లో 200కు పైగా అండర్ సర్వేడ్ (వెనుకబడిన వర్గాల ప్రజలు) కుటుంబాలకు అండగా ఆటా – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) New Jersey టీమ్ మరియు ATA NJ యూత్ టీమ్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఒక విశేషమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్ ప్రాంతంలో ఉన్న Open Door Food Pantry కు 2,000 పౌండ్లకు పైగా నిల్వ ఉంచగలిగే ఆహార పదార్థాలను విరాళంగా అందించారు.
ఈ ఆహార విరాళాల ద్వారా రాబోయే హాలిడేస్ సీజన్‌లో ఆహార అవసరాలు ఉన్న 200కు పైగా కుటుంబాలకు సహాయం అందనుంది. సమాజ సేవే లక్ష్యంగా, అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలనే సదుద్దేశంతో ATA చేపట్టిన ఈ కార్యక్రమం మానవత్వానికి (Humanity), సామాజిక బాధ్యతకు మరియు సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమాన్ని నిర్వహించిన వారు – ATA NJ యువజన (Youth) బృందం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన యువత: • ఇషితా ములే • ఇషాని రెడ్డి కోరమ్ • షణ్ముఖప్రియ ములే • అయాన్ రెడ్డి తుమ్మల • సహజ వుల్లపుల • రిషిత జంబుల • సహర్ష కోర్కిశాల
కార్యక్రమ సమన్వయకర్తలు (Coordinators) – ATA ప్రాంతీయ సమన్వయకర్తలు • కృష్ణ మోహన్ ములే • ప్రదీప్ కట్టా • ప్రసాద్ ఆకుల కార్యక్రమానికి సహకరించిన వారు • సంతోష్ రెడ్డి కోరమ్ – ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT) • వినోద్ కోడూరు – ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT) • విలాస్ రెడ్డి జంబుల – ATA రీజినల్ డైరెక్టర్ • శ్రీకాంత్ తుమ్మల – ATA మెంబర్షిప్ చైర్ • శరత్ వేముల – ATA న్యూ జెర్సీ సీనియర్ నాయకులు • ఇతర కమ్యూనిటీ సభ్యులు మరియు వాలంటీర్లు.
ఈ సేవా కార్యక్రమానికి తమ ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించిన ATA చైర్ జయంత్ చెల్లా (Jayanth Challa) గారికి మరియు ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రామసహాయం (Satish Reddy) గారికి ATA రీజినల్ కోఆర్డినేటర్స్ మరియు న్యూ జెర్సీ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ATA NJ యూత్ టీమ్ చూపిన చొరవ, అంకితభావం, సేవా స్ఫూర్తి ప్రత్యేకంగా అభినందనీయం. యువతలో సామాజిక బాధ్యతను, నాయకత్వ (Leadership) లక్షణాలను మరియు సేవాభావాన్ని పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి.
సేవే మన ధర్మం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం. ఒక్క మంచి ఆలోచన, ఒక్క చిన్న సహాయం… ఎన్నో కుటుంబాల (Families) జీవితాల్లో ఆనందాన్ని నింపగలవు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association – ATA) న్యూ జెర్సీ బృందం.