Las Vegas, October 31, 2026: చిత్రదుర్గలోని ఎస్‌జేఎంఐటీ (SJM Institute of Technology) కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అమెరికాలోని లాస్ వెగాస్ (Las Vegas, Nevada) నగరంలో అక్టోబర్ 31న ఘనంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగింది. ఈ సమ్మేళనంలో కళాశాలతో అనుబంధం ఉన్న సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ కళాశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1980లో ప్రారంభమైన ఎస్‌జేఎంఐటీ (SJM Institute of Technology) కళాశాలలో తమకు బోధించిన గురువులు, స్నేహితులు, కళాశాలలో గడిపిన మరపురాని క్షణాలను ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.
నాటి సరదా సంఘటనలు, అనుభవాలను పరస్పరం పంచుకుంటూ నవ్వులు, పలకరింపులతో సమ్మేళనాన్ని సందడిగా మార్చారు. వృత్తి, కుటుంబ జీవితం, పదవీ విరమణ (Retirement), భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ఆత్మీయంగా ముచ్చటించారు.
ఎన్నేళ్లు గడిచినా తమ మధ్య స్నేహబంధం, అనుబంధం చెక్కుచెదరలేదని ఈ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. నిర్వాహకుల సమష్టి కృషి, చక్కటి సమన్వయం, ఆత్మీయ ఆతిథ్యం ఈ సమ్మేళనాన్ని (Alumni Meet) చిరస్మరణీయంగా నిలిపాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకట్ మాలపాటి (Venkat Malapati), భక్త బల్లా (Bhakta Balla), మాదల శ్రీనివాస్, శ్రీధర్ గోనుగుంట్ల, శ్రీనివాస్ గొంది, ప్రవీణ్ రెడ్డి, పాపి రెడ్డి, శరత్ పున్‌రెడ్డి, వంశీ గరికపాటి, శ్రీనివాస్ రెడ్డి ఎర్ర, చంద్ర రాగ్యారి, కృష్ణ పూర్రులకు పూర్వ విద్యార్థులందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఆత్మీయ కలయికకు చొరవ తీసుకున్న రవికుమార్ వెనిగళ్ళ (Ravi Venigalla) గారి కృషిని పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ, 2028లో మరోసారి కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy), దేశి గోల్ఫర్ శ్రీనివాస్ అక్కల తదితరులు పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది వ్యాఖ్యాతగా వ్యవహరించారు. BLNR ఫోటోగ్రఫీ నరసింహారెడ్డి చక్కని ఫోటోలు తీశారు.
ఎప్పుడో చదువులు ముగించుకొని, వివిధ వృత్తుల్లో మరియి వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు (Alumni Meet) తృప్తినిస్తాయన్నారు SJMIT పూర్వ విద్యార్థులు. మధుర జ్ఞాపకాలను హృదయాల్లో పదిలపరచుకుని అందరూ ఆనందంగా వీడ్కోలు పలికారు.