- అమెరికా (Virginia) లో వినూత్నంగా మహిళల జ్ఞాపకాల వేడుక
- సంస్కృతి, సంతోషం, మధురస్మృతుల మహోత్సవం
- వచ్చే ఏడాది తానా మహాసభల్లో కళాప్రతిభలను ప్రదర్శించే అవకాశం
“జ్ఞాపకాల వేడుక అంటే కేవలం పాత పాటలు, వస్త్రధారణ మాత్రమే కాదు. మన జ్ఞాపకాలు, సంస్కృతి, విలువలతో ముడిపడిన ఒక అందమైన ప్రయాణం.” అని సాయి సుధ పాలడుగు (Sai Sudha Paladugu) అన్నారు. అమెరికాలో (Washington D.C.) నిర్వహించిన ఈ మహిళల జ్ఞాపకాల వేడుక ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.
ఈ సందర్భంగా సాయి సుధ పాలడుగు (Sai Sudha Paladugu) మాట్లాడుతూ.. ఇది కేవలం వినోద కార్యక్రమం కాదు. మన పాతతరం మహానటులు, గాయకులు, కళాకారులకు ఇచ్చే హృదయపూర్వక నివాళి. తమ ప్రతిభ, కృషి, పట్టుదలతో కళారంగంలో విశిష్ట స్థానం సంపాదించి, తరువాతి తరాలపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయులను మనం ఎప్పటికీ మరువలేం.
వారి కళను గౌరవించడం, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. ఈ వేడుక (Ladies Retro Meet-up) ద్వారా మన సంప్రదాయాలు, కళలు, సంగీతం, వస్త్రధారణ, కుటుంబ విలువలు వంటి మన మూలాలను మరోసారి స్మరించుకున్నాం. మన మూలాలే మన గుర్తింపు.
వాటిని గౌరవిస్తూ, పరిరక్షిస్తూ, భావితరాలు తమ కొత్త ఆలోచనలతో వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం తానా (TANA) మహాసభల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గానం, నృత్యం, నటన, నృత్యరూపకల్పన వంటి అనేక కళాప్రతిభలను ప్రదర్శించేందుకు విస్తృత అవకాశాలు కల్పించబడనున్నాయి.
తానా (Telugu Association of North America – TANA) కేవలం ఒక వేదిక కాదు. మన మూలాలను కాపాడుతూ, మన సంస్కృతిని ఘనంగా జరుపుకుంటూ, మన ప్రతిభను భావితరాలకు అందించే సజీవమైన కుటుంబం. మన మూలాలు బలంగా ఉంటే, మన భవిష్యత్తు మరింత బలంగా ఉంటుంది.” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తానా (Telugu Association of North America – TANA) సాంస్కృతిక బృంద సభ్యులు సుష్మ అమృతలూరి (Sushma Amruthaluri), శ్రీవిద్య సోమ (Srividya Soma), హరిత వెలగా, నివేదిత, శైలజ, గీత, శ్రీదేవి, తనూజ, శాంతి, శ్వేత, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.