తెలుగు సాంస్కృతిక సమితి (TCA) 2026–2027 కార్యవర్గం తరఫున, శ్రీ చార్లీ చౌదరి గారితో కలిసి హ్యూస్టన్ (Houston, Texas) లోని భారత కాన్సుల్ జనరల్ D. C. Manjunath గారిని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం తెలుగు సాంస్కృతిక సమితి (TCA) కార్య నిర్వాహక కమిటీ నాయకులకు లభించింది.
ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, తెలుగు సమాజ ఐక్యత మరియు యువతలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించే అంశాలపై సార్థక చర్చ జరిగింది. అలాగే, ఆగస్టు 7 మరియు 8 తేదీలలో జరగనున్న TCA స్వర్ణోత్సవాల (Golden Jubilee Celebrations) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా ఆహ్వానించారు.
తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, మన గొప్ప సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ చారిత్రాత్మక వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు TCA కట్టుబడి ఉంది అని తెలుగు సాంస్కృతిక సమితి (Telugu Cultural Association – TCA) అధ్యక్షులు యాదగిరి రెడ్డి కుడుముల (Yadagiri Reddy Kudumula) తెలిపారు.