Connect with us

Schools

తానా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హోంవర్క్ డైరీల పంపిణీ @ Tenugupudi, Anakapalli

Published

on

Tenugupudi, Anakapalli: అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో ఈరోజు SATVIINSPIRE ఫౌండేషన్ మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) సంయుక్త ఆధ్వర్యంలో చి. శ్రీచరణి మేకా స్పాన్సర్ చేయగా, కార్యక్రమాన్ని తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ చౌదరి మేకా సమన్వయం చేయగా విద్యార్థులకు హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు.

ఈ హోంవర్క్ డైరీలు విద్యార్థులు ప్రతిరోజూ చేసే హోంవర్క్, పాఠశాల కార్యకలాపాలు, విద్యా పురోగతిని తల్లిదండ్రులు (Parents) సులభంగా పర్యవేక్షించడానికి ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు (Teachers) తెలిపారు. విద్యార్థులలో క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు, పాఠశాల-తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ డైరీలు దోహదపడతాయని పేర్కొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Headmaster) డి.ఎస్.ఎస్.వి. ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సహకరించిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, తానా ఫౌండేషన్ సభ్యులకి మరియు SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు (Teachers) అందించిన సహకారాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ పెద్దాడ వెంకటరమణ గారు, శ్రీనివాసరావు గారు, మహేశ్వరరావు గారు, కొండమ్మ గారు, త్రినాధరావు గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali),తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి (Dr. Prasad Nalluri), తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరియు తానా న్యూజెర్సీ బృందం మార్గదర్శకత్వం, సహకారం అందించారు.

ఈ సందర్భంగా SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. అర్హత కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్న మరియు అధిక సంఖ్యలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలకు (Government Schools) భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

విద్యార్థుల (Students) విద్యాభివృద్ధికి తోడ్పడే ఈ హోంవర్క్ డైరీల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు మరియు అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, తెనుగుపూడి ప్రభుత్వ పాఠశాల సిబ్బంది అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected