Washington D.C.: యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియా (Virginia) లో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ పతంజలి మహర్షి కి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పుష్పమాల వేసి, నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) సమన్వయపరిచారు. ఈ సందర్భంగా మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ.. యోగ అనేది కేవలం శారీరక వ్యాయాయమే కాదు. శరీరం, మనస్సును సమన్వయం చేసే గొప్ప భారతీయ సంప్రదాయం. యోగ ద్వారా ఆరోగ్యం, ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన మరియు అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మన జీవితంలో అత్యంత అవసరమైన సాధనంగా మారిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) యోగ ప్రక్రియను ప్రజల కందించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. గతేడాది నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది.
భాను మాగులూరి మాట్లాడుతూ.. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన (Health), ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. మన పెద్దలు మనకు అందించిన అమూల్యమైన కార్యక్రమం యోగ. 175 దేశాల్లో మన సాంప్రదాయ యోగని ఆచరిస్తున్నారు. ప్రపంచ యోగ దినోత్సవాన్ని (International Day of Yoga) అగ్రరాజ్యమైన అమెరికాలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. మాతృబాష తెలుగును ఈ తరానికందించటం మన భాధ్యతన్నారు.
ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు మైనేని రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. యోగా (Yoga) ప్రకృతి ప్రసాదించిన వరం అని, నిలబెట్టుకోవటం, అబ్యాసం చేయటం మన భాద్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ అమరవాది పలు యోగాసనాలలో మెళకువలు చెప్పారు.
ఈ యోగా (Yoga) కార్యక్రమం లో సీతారామారావు ఎండూరు, రమేష్ అవిర్నేని, మురళి కట్ల, హనుమంతురావు వెంపరాల, చంద్రనాధ్ నంబూరు, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం, వెంకటేశ్వర్రావు సామినేని, ఈశ్వర్ కక్కెర, వెంకటరెడ్డి గోలి, సుబ్బారెడ్డి జొన్నల, కృష్ణయ్య, రమణ, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, ప్రభులింగం బచ్చు తదితరులు పాల్గొన్నారు.