Connect with us

Events

Toronto, Canada : అంగరంగ వైభవంగా తెలంగాణ కెనడా సంఘం పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

Published

on

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ఈ పండుగను కమిటీ కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి గారు ప్రారంభించగా, శ్రీమతి స్వాతి మన్నెం గారు, శ్రీమతి మేఘన గుర్రాల గారు, శ్రీమతి అపర్ణ భరద్వాజ్ పోపూరి గారు, శ్రీమతి ప్రసన్న గుజ్జుల గారు మరియు శ్రీమతి శ్రీజ చెట్టిపెల్లి గారు జ్యోతి ప్రజ్వలన చేశారు.

శ్రీ ఉదయ గంగాధర్ గారు ఆలపించిన గణేష వందనంతో ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలను (Cultural Programs) ప్రారంభించారు. ఈ వేడుకను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమానికి శ్రీ ప్రవీణ్ చిమట (రియల్టర్, Royal LePage) ” ఈవెంట్ స్పాన్సర్” గా నిలిచి ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు శ్రీ భాను ప్రకాష్ గారు శ్రోతలకు ఉగాది పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) చేశారు.

వరుసగా 2వ సంవత్సరం 13 సంవత్సరాల లోపు చిన్నారులకు స్పెల్లింగ్ ఛాలెంజ్ పోటిలను విజయవంతంగా నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ పోటిలో గెలిచిన చిన్నారులకు శ్రీ ప్రవీణ్ చిమట గారి చేతులు మీదుగా ట్రోఫిలను అందజేశారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem) గారు మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. ఈ తెలుగు సంవత్సరం అందరికి శుభప్రదంగా ఉండాలని కోరుకున్నారు. తరువాత, TCA బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల (Naveen Aakula) మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ మన వేడుకల్లో పాల్గొంటున్న స్మాల్ బిజినెస్ లను ప్రోత్సహించవలసిందిగా అందరిని కోరారు.

చివరిగా TCA వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్ మాట్లాడుతూ.. శ్రీ పరాభవ నామ సంవత్సర విశిష్టతను తెలుపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు అందించారు. ఉగాది సంబరాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు మరియు శ్రీమతి మాధురి చతరాజు గారు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా, 113 కళాకారులు 25 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరించారు.

వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తు వస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ (Shopping Stalls) ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షులు శ్రీ శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రణీత్ పాలడుగు, కోశాధికారి శ్రీ రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి శ్రీ నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీమతి శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శ్రీ శరత్ యరమల్ల పాల్గొన్నారు.

అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీ పవన్ కుమార్ పెనుమచ్చ, శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడితో పాటు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association – TCA) ఉపాధ్యక్షులు శ్రీ శంతన్ నారెళ్ళపల్లి గారి కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2026 వేడుకలు ఘనంగా ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected