Connect with us

Associations

కుటుంబ వాతావరణంలో GTA వలంటీర్ అప్ప్రీసియేషన్ & కిక్ ఆఫ్ @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) 2026వ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. అట్లాంటాలో నిర్వహించిన కిక్ ఆఫ్ మరియు వలంటీర్ అప్ప్రీసియేషన్ కార్యక్రమానికి GTA నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ కుటుంబాలతో హాజరై విజయవంతం చేశారు.

వ్యాఖ్యాత పల్లవి ఈ కార్యక్రమాన్ని ఆత్మీయ స్వాగతంతో ప్రారంభం చేసి చక్కగా ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా GTA Atlanta Chapter 2025 అధ్యక్షులు అరవింద్ కట్టా (Aravind Katta) 2025లో సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాలను వివరించి, సంఘానికి అండగా నిలిచిన సభ్యులు, వాలంటీర్లు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం వ్యాఖ్యాత గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) జాతీయ నాయకత్వాన్ని ఆహ్వానించగా, జాతీయ అధ్యక్షులు బాపురెడ్డి కేతిరెడ్డి (Bapureddy Kethireddy), వైస్ ప్రెసిడెంట్ డా. నందిని సుంకిరెడ్డి (Dr. Nandini Sunkireddy), బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజేందర్ జనుంపల్లి నేతృత్వంలోని బృందం వేదికపైకి విచ్ఛేసారు.

ఈ సందర్భంగా బాపురెడ్డి కేతిరెడ్డి (Bapureddy Kethireddy) మాట్లాడుతూ.. GTA దృష్టి, భవిష్యత్తు సేవా ప్రణాళికలు, అమెరికా మరియు భారతదేశాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలు, కన్వెన్షన్‌పై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే డా. నందిని సుంకిరెడ్డి, రాజేందర్ జనుంపల్లి ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు.

తదుపరి GTA అట్లాంటా చాప్టర్ 2026 నాయకత్వ బృందం వేదికపైకి రాగా, GTA అట్లాంటా చాప్టర్ నూతన అధ్యక్షులు సంతోష్ రెడ్డి గడ్డం (Santosh Reddy Gaddam) ఈ సంవత్సరం సంస్థ చేపట్టనున్న సరికొత్త సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా GTA నాయకులు సంఘానికి సహకరించిన స్పాన్సర్లను పుష్పగుచ్ఛం మరియు శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) కోర్ కమిటీ సభ్యులను వారి కుటుంబాలతో కలిసి అభినందించి, వారి సేవలను గుర్తించారు.

స్పాన్సర్లు మరియు శ్రేయోభిలాషులు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) తో తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే మీడియా ప్రతినిధులను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వేదికపై సన్మానించారు. డీజే సంగీతంతో ఈ వాలంటీర్ అప్ప్రీసియేషన్ & కిక్ ఆఫ్ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా డాన్సులతో సందడి చేశారు.

గ్లోబల్ తెలంగాణ సంఘం (Global Telangana Association – GTA) నిర్వహించిన వలంటీర్ అప్ప్రీసియేషన్ & కిక్ ఆఫ్ ఈవెంట్ లో అనేక జ్ఞాపక చిత్రాలు తీసుకున్న అనంతరం, కుటుంబ వాతావరణంలో రుచికరమైన విందుతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులను ఒకే వేదికపై ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) సేవా సంకల్పం 2026లో మరింత ధృడంగా ఉండాలని, అలాగే విజయవంతమవ్వాలని NRI2NRI.COM అభిలాషిస్తోంది.

error: NRI2NRI.COM copyright content is protected