Connect with us

Chess

Charlotte, North Carolina: మేధస్సుకు పదును పెడుతూ NATS చదరంగం పోటీలు

Published

on

Charlotte, North Carolina: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం “నాట్స్” షార్లెట్‌లో చదరంగపోటీలు నిర్వహించింది. షార్లెట్ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన చదరంగం టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.

స్థానిక చిన్నారులు,పెద్దల మేధస్సుకు పదును పెడుతూ నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో 50 మందికి పైగా చెస్ (Chess) ప్లేయర్లు  ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు విభాగాలుగా  నిర్వహించిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలలో ప్రతి విభాగం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులను అందజేశారు.

తెలుగు వారిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాట్స్ (North America Telugu Society – NATS) తీసుకుంటున్న రవను స్థానికులు అభినందించారు. గెలుపోటముల కంటే కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం, కొత్త విషయాలను నేర్చుకోవడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నాట్స్ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిజయం సాధించేందుకు సహకరించిన వాలంటీర్లకు, తల్లిదండ్రులకు నాట్స్ షార్లెట్ (NATS Charlotte Chapter) ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..నాట్స్ చదరంగ పోటీలను విజయవంతం చేసిన నాట్స్ షార్లెట్ టీంని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు  శ్రీహరి మందడి (Srihari Mandadi) అభినందించారు.

విజేతల వివరాలు

అన్ రేటేడ్

1)బొడ్డుకూరి దేవాన్ష్

2) రావల్ శాశ్వత్

3)మోరంపూడి శర్వ విహాన్

700 కంటే తక్కువ రేట్ వర్గం

1)నంబూరి విహాన్

2)శ్రీవత్స అనవి

3) దండు నిహాల్

700 కంటే ఎక్కువ రేట్  వర్గం

1)నంబూరి అనిల్ కుకర్

2)మల్లికార్జున అద్వైత్

3)అభిషక కేశవ్