Connect with us

Donation

సిద్దార్ధ మెడికల్ కాలేజీ విద్యార్థినికి ల్యాప్టాప్ సహాయం: తానా ఆదరణ @ విజయవాడ

Published

on

తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఒక నిరుపేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందించి సహాయం చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది కీర్తి పావులూరి. నిరుపేదనైన తనకు కోవిడ్ కష్టకాలంలో ల్యాప్టాప్ సహాయం చేసినందుకు తానాకు కృతఙ్ఞతలు తెలిపింది.

ల్యాప్టాప్ దాత భార్గవ్ కిలారు. సోమవారం డిసెంబర్ 20న పృథ్వి చేకూరి సమన్వయపరిచిన ఈ సహాయాన్ని తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, షర్మిల సామినేని, వెంకట్ అమరనేని, నిలయ అమరనేని చేతుల మీదుగా విజయవాడలో కీర్తికి అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected