Connect with us

Beauty Pageant

యువత ప్రతిభకు పట్టం కట్టిన ధీం-తానా పోటీలు @ Atlanta, Georgia

Published

on

రెండు సంవత్సరాలకు ఒకసారి తానా కన్వెన్షన్ లో భాగంగా ధీం-తానా (DhimTANA) పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. 24వ తానా కన్వెన్షన్ కి ముందు అన్ని నగరాలలో లానే గత ఆదివారం జూన్ 8న అట్లాంటా (Atlanta) లో నిర్వహించిన ధీం-తానా పోటీలు యువత ప్రతిభకు పట్టం కట్టాయి.

అట్లాంటాలోని డులూత్ (Duluth, Georgia) పట్టణం, జేడ్ బాంక్వెట్స్ (Jade Banquets) లో నిర్వహించిన ధీం-తానా 2025 పోటీలను తానా నాయకులు, ధీం-తానా టీం జ్యోతి ప్రజ్వలనతో ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ముందుగా సోలో సింగింగ్, గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించారు.

అనంతరం మిస్ టీన్ తానా (Miss Teen TANA), మిస్ తానా, మిసెస్ తానా పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాలలో కలిపి రెజిస్ట్రేషన్స్ ఎక్కువ రావడం చూస్తే ధీం-తానా (DhimTANA) 2025 పోటీలకు అట్లాంటా (Atlanta) లో మంచి ఊపు తెచ్చిందనిపిస్తుంది.

పలు విభాగాల జడ్జెస్ ని వేదిక మీదికి ఆహ్వానించి శాలువా మరియు పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. సాయంత్రం వివిధ విభాగాల విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా మెడల్స్, ట్రోఫీస్, క్రౌన్ అందించారు. తానా కళాశాల (TANA Kalasala), తానా పాఠశాల వివరాలను పంచుకున్నారు. తానా పాఠశాల (TANA Paatasala) విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.

డెట్రాయిట్‌లోని నోవై (Novi, Detroit, Michigan) లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా 24వ మహాసభలకు అందరినీ ఆహ్వానించారు. పలు జాతీయ, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు అట్లాంటా ధీం-తానా (DhimTANA) పోటీలకు విచ్చేసి తమ మద్దతు తెలిపారు.

వాలంటీర్స్ కి డిన్నర్ ఏర్పాట్లు చేశారు. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (Telugu Association of Metro Atlanta – TAMA) ఈ కార్యక్రమానికి కోహోస్ట్ గా వ్యవహరించింది. మాలతి నాగభైరవ (Malathi Nagabhirava), సోహిని అయినాల (Sohini Ayinala), పూలని జాస్తి, ఆర్తిక అన్నే, పావని గద్దె, లక్ష్మి మండవల్లి ఈ పోటీలను విజవంతంగా నిర్వహించడం అభినందనీయం.

తానా సౌత్ఈస్ట్ ప్రాంతీయ కార్యదర్శి (TANA Southeast Regional Coordinator) మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) సారధ్యంలో తానా నాయకులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu), శ్రీనివాస్ లావు (Srinivas Lavu), వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని, భరత్ మద్దినేని, అనీల్ యలమంచిలి తదితరులు ముందుండి నడిపించారు.

అప్రతిహాతంగా రోజంతా సాగిన ఈ అట్లాంటా (Atlanta) ధీం-తానా పోటీల హైలైట్స్ టీవీ9 లో ప్రసారం అవుతాయి. ఈ సందర్భంగా ధీం-తానా నిర్వాహకులు తానా నాయకులకు, వాలంటీర్లకు, తామా (TAMA) జట్టుకి, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected