తెలంగాణ తెలుగమ్మాయి త్రిష గొంగడి (Trisha Gongadi) మహిళల అండర్ 19 ప్రపంచ కప్ 2025 లో స్కాట్లాండ్ (Scotland) తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీతో అదరగొట్టింది. అండర్ 19 మహిళల ప్రపంచ కప్ (Women’s U19 T20 Cricket World Cup)చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణిగా త్రిష చరిత్ర సృష్టించారు.
186.44 స్ట్రైక్ రేట్‌తో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాది, కేవలం 59 బంతులలో 110 పరుగులు చేసింది. త్రిష గొంగడి (Trisha Gongadi) తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో జన్మించారు. రెండేళ్ల వయసు నుంచే తండ్రి క్రికెట్ ఆడటం నేర్పించడంతో కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే హైదరాబాద్ అండర్-16 జట్టులో భాగమైంది.
ఆ తర్వాత అండర్-23 కూడా ఆడింది. 17 ఏళ్లకే 2023 ICC అండర్ 19 ప్రపంచ మహిళా టీ20 క్రికెట్ కప్ గెలిచిన భారత (India) జట్టులో ఆడి త్రిష గొంగడి (Trisha Gongadi) అందరి మన్ననలు పొందింది. అదే సంవత్సరం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) తానాతో బంధం ఏర్పడింది.
తానా తో బంధం
పేద కుటుంబానికి చెందిన త్రిష (Trisha Gongadi) క్రికెట్ కోచింగ్, ఆట పరికరాలు, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర అవసరాలకు ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో క్రికెట్ పై ఇష్టాన్ని చంపుకోలేక ఆర్ధిక సహాయం కోసం అప్పటి తానా (TANA) క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ని సంప్రదించారు. అప్పటి న్యూస్ ఆర్టికల్ మీ కోసం ఇదిగో.
స్వతహాగా శశాంక్ యార్లగడ్డ (Shashank Yarlagadda) కూడా స్పోర్ట్స్ పర్సన్ అవ్వడంతో త్రిష గొంగడి కి సహాయం చేయడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) తానా తరపున ఫండ్రైజర్ (Fundraiser) మొదలు పెట్టి నిధుల సమీకరణ చేశారు.ఆ ప్రాసెస్ లో దేవుడు కూడా చల్లని చూపు చూడడంతో త్రిష కు ఒక మంచి కార్పోరేట్ సంస్థ నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది.
దీంతో తానా ఫండ్రైజర్ ద్వారా సేకరించిన నిధులతో త్రిష లాంటి ఇతర పేద క్రీడాకారులకు సహాయం చేయాలని నిర్ణయించి రంజీలు, ఇతరత్రా క్రికెట్ టౌర్నమెంట్స్ ఆడుతున్న 9 మంది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరియు తెలంగాణ (Telangana) రాష్ట్రాలకు చెందిన యువ పేద క్రీడాకారులకు త్రిష గొంగడి సమక్షంలో ప్రొఫెషనల్ ఇంగ్లీష్ విల్లో (English Willow) బ్యాట్స్ అందించి సహాయం చేశారు. 2023 లోఅప్పటి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.