Connect with us

Entertainment

అలరించిన ప్రముఖ యాంకర్‌ సుమ @ నారీ ఈవెంట్, TANA & Desi Hangout, Austin

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), దేశీ హ్యాంగ్‌ ఔట్‌ (Desi Hangout) ఆధ్వర్యంలో జరిగిన నారీ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్‌ సుమ (Tollywood Anchor Suma Kanakala) పాల్గొని వచ్చినవారిని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా సుమ అస్టిన్‌ (Austin, Texas) రావడంతో ఈ కార్యక్రమం ఊహించినదానికన్నా ఎక్కువగా విజయవంతం అయింది.

ఈ సందర్భంగా నిర్వహించిన గేమ్‌ షోలు, డ్యాన్సులు, లైవ్‌ డిజె కార్యక్రమాలు, ఇంటరాక్టీవ్‌ గేమ్స్‌ లలో ఎంతోమంది పాల్గొని ఎంజాయ్‌ చేశారు. వచ్చినవారికి పసందైన విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడం పట్ల తానా సౌత్‌ వెస్ట్‌ ఆర్‌ వి పి సుమంత్‌ పుసులూరి (Sumanth Pusuluri) సంతోషం వ్యక్తం చేశారు.

తానా (TANA) చేస్తున్న సేవా కార్యక్రమాలను, ఆపదలో తానా టీమ్‌ స్క్వేర్‌ (Team Square) చేస్తున్న సహాయాన్ని వివరించారు. విజయవాడ వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను (Flood Victims) తానా ఆదుకుంటున్న విషయాలను కూడా తెలియజేశారు. ఈ వరద సహాయంలో అందరూ పాలుపంచుకుని తానాకు విరాళాలను ఇవ్వాల్సిందిగా కోరారు.

తానా (Telugu Association of North America) సభ్యులు బాలాజీ పర్వతనేని, మురళీ తాళ్ళూరి, శ్రీధర్‌ పోలవరపు, లెనిన్‌ యర్రం, చిరంజీవి ముప్పవరపు, సూర్య ముళ్ళపూడి, కావ్య, లావణ్య అనంత, లక్ష్మీ తదితరులు ఈ నారీ ఈవెంట్ విజయవంతానికి కృషి చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected