18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (ATA 18th Convention & Youth Conference) లో భాగంగా ‘ఝుమ్మంది నాదం’ అంటూ పాటల పోటీలు (Solo Singing Competitions) అమెరికాలోని పలు నగరాలలో నిర్వహిస్తున్నారు. ప్రిలిమినరీ స్క్రీనింగ్ యూ ట్యూబ్ వీడియోస్ ద్వారా చేస్తారు.
సంగీత ప్రియులకు, వర్థమాన గాయనీ-గాయకులకు అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ వారి ఈ సోలో సింగింగ్ పోటీలు మంచి వేదిక అవ్వనున్నవి. ఇందులో భాగంగా అట్లాంటా సిటీ సెమీఫైనల్స్ ఏప్రిల్ 13న కమ్మింగ్ నగరంలోని బంజారా బాంక్వెట్స్ లో నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ప్లేబాక్ సింగర్ అంజనా సౌమ్య ఈ అట్లాంటా (Atlanta) పోటీలకు జడ్జిగా వ్యవహరించనున్నారు.
ఫైనల్స్ 18వ ఆటా కన్వెన్షన్ (ATA Convention) వేదిక జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఇండియా నుంచి వస్తున్న సంగీత దర్శకులు నిహాల్ కొండూరి మరియు గేయ రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా నిర్వహించి విజేతలకు, రన్నరప్ లకు ఆటా (American Telugu Association) టైటిల్స్ అందజేస్తారు.
అమెరికా తెలుగు సంఘం ATA ‘ఝుమ్మంది నాదం’ పాటల పోటీలకు జనార్దన్ పన్నెల ఛైర్ గా, సత్య కర్నాటి అడ్వైజర్ గా, శ్రీవల్లి శ్రీధర్ & మౌనికారెడ్డి చింతల & విజయకుమార్ వింజామర కోఛైర్స్ గా, రామారెడ్డి తేతలి, అరుణ్ కావలి, శివకిరణ్ లింగిశెట్టి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. టీవీ9 (TV9) మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.