Connect with us

News

Clean & Green by NATS @ Tampa Bay, Florida: హైవేను శుభ్రపరిచిన నాట్స్ సభ్యులు, Adopt A Highway

Published

on

అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడా లోని టాంపా బే లో నాట్స్ (North America Telugu Society) విభాగం మరో ముందడుగు వేసింది.

అమెరికాలో రహదారుల పరిరక్షణ (Adopt A Highway), పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టాంప బే విభాగం టాంపా బే లోని ఎస్.ఆర్. 581/బ్రూస్ B డౌన్స్ Blvd రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకున్నారు.

ఈ ప్రకారం ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవేను శుభ్రపరిచారు. 35 మంది నాట్స్ సభ్యులు, స్థానికంగా ఉండే హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కేవలం పాఠశాల విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు పాల్గొని ప్రశంసలు కురిపించారు.

రెండు మైళ్ల పాటు రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త, చెదారం అంతా తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. విద్యార్ధుల్లో కూడా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు నాట్స్ (North America Telugu Society) ఈ కార్యక్రమం చేపట్టింది.

ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) సేవా ధ్రువ పత్రాలను అందించింది. జనవరి 14, 2024 న నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నాట్స్ టాంపా బే (NATS Tampa Bay Chapter) నాయకత్వం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు.

ఈ (Adopt A Highway) డ్రైవ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ గారు, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ / మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు తమ సహకారాన్ని అందించారు.

అలాగే నాట్స్ (NATS) జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బుజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, అనిల్ అరేమండ, భార్గవ్ మాధవరెడ్డి, ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ వర్క్‌షాప్ విజయవంతం చేయడానికి కృషి చేశారు.

భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి (Bapu Nuthi) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected