Connect with us

Movies

Movie Time @ Raleigh: నేలకొండ భగవంత్ కేసరి సినిమా హంగామా

Published

on

నేలకొండ భగవంత్ కేసరి సినిమా ఓవర్సీస్ లో నిన్న విడుదలై జైత్రయాత్ర ని కొనసాగిస్తున్న సంగతి అందరికీ, ముఖ్యంగా సినీ లవర్స్ కి తెలిసిందే. అమెరికాలో అన్ని నగరాల్లో ఈ సినిమా సందడి నెలకొంది. బాలయ్య (Nandamuri Balakrishna) ఫ్యాన్స్ కేకులు కట్ చేస్తూ, స్లొగన్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

ఇందులో భాగంగా నార్త్ కెరొలినా రాష్ట్రం, రాలీ నగరంలో కూడా బెనిఫిట్ షో తో హంగామా చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రీత్యా విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ బాలయ్య 108వ సినిమా కావడంతో అభిమానులు సినిమా హాలు దగ్గిర సమావేశమయ్యారు.

జై బాలయ్య, బాబుతో మేము, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి విజయోత్సవం నిర్వహించారు. Nelakonda Bhagavanth Kesari సినిమా ప్రదర్శించే హాలు బయట తెలుగుదేశం పార్టీ జండాలు, బాబుతో నేను అని రాసి ఉన్న ప్లకార్డ్స్ ప్రదర్శించారు.

మిథున్ సుంకర, రవి కిషోర్ లాం, కేశవ్ వేముల, వంశి బొట్టు, రాజేష్ యార్లగడ్డ, మూర్తి ఎక్కిన, రామ్ అల్లు, శ్రీపాద కాసు, సురేష్ వెల్లంకి మరియు కుమార్ చల్లగుళ్ళ ఆధ్వర్యంలో ఈ నేలకొండ భగవంత్ కేసరి సినీ (Movie) కార్యక్రమం నిర్వహించారు.

అలాగే రాలీ టీడీపీ (Raleigh TDP) ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. నార్త్ కెరొలినా రాష్ట్రం, రాలీ నగర తెలుగు ప్రవాసులు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాజమండ్రి సెంట్రల్ జైలు కి ఉత్తరాలు రాశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected