Connect with us

Events

Malaysia, Kuala Lumpur: భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో 1,300 మందితో దీపావళి – దసరా ఉత్సవ్

Published

on

భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (Bharatiya Association of Malaysia – BAM) ఆధ్వర్యంలో ‘బామ్ దీపావళి–దసరా ఉత్సవ్ 2026’ ఘనంగా జరిగింది. Kuala Lumpur లోని బ్రిక్‌ఫీల్డ్స్‌ ప్రాంతంలో, కాంప్లెక్స్ టీఎల్‌కేలో ఉన్న టానియా గ్రాండ్ హాల్‌ ఈ వేడుకకు వేదికైంది.

కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ప్రథమ కార్యదర్శి శ్రీ రాజేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు (Leaders) కూడా పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి 1,300 మందికి పైగా హాజరై వేడుకను విజయవంతం చేశారు.

మలేషియా (Malaysia) లో నివసిస్తున్న వివిధ భారతీయ సమాజాలకు చెందిన కుటుంబాలు ఒకచోట చేరి దీపావళి, దసరా పండుగలను ఉత్సాహంగా జరుపుకున్నాయి. చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలు కలిసి పాల్గొన్న ఈ వేడుక భారతీయుల మధ్య ఐక్యతకు, సాంస్కృతిక అనుబంధానికి అద్దం పట్టింది.

శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో సైబర్‌జయలోని భక్తి గురుకులం చిన్నారుల భజనలు, మహారాష్ట్ర లెజీమ్ నృత్యం, మార్వాడీ నృత్యం ప్రేక్షకులను అలరించాయి. ‘డ్యాన్సింగ్ దివాస్’ బృందం వివాహ వేడుకను నృత్యరూపంలో ప్రదర్శించింది. మహిళల (Women) ఫ్యూజన్ నృత్యం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనల అనంతరం బామ్ కమిటీ కళాకారులకు జ్ఞాపికలు అందజేసింది.

‘బామ్ టాలెంట్ షోకేస్‌’కు 29 ఎంట్రీలు రాగా, తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారిని వేదికపై సత్కరించారు. ‘మిస్టరీ బాక్స్’, ‘లక్కీ సీట్’ కార్యక్రమాల్లో ప్రేక్షకులు (Audience) ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబాలన్నీ కలిసి పండుగ విందును ఆస్వాదించారు. చివరగా మహారాష్ట్ర ఢోలు మోతకు చిన్నారులు, పెద్దలు కలిసి దాండియా ఆడటంతో ఉత్సవం సందడిగా ముగిసింది.

బామ్ ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దాస్యం మాట్లాడుతూ, “ఈ ఉత్సవానికి 1,300 మందికి పైగా హాజరై విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయ కుటుంబాలు (Families) ఒకచోట చేరి మన సంస్కృతిని, పండుగలను కలిసి జరుపుకోవడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

ఈ విజయానికి కృషి చేసిన మా కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు (Volunteers), కళాకారులు, ప్రాయోజకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో మరిన్ని సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు సాగుతాం” అని తెలిపారు.

ప్రీమియం స్పాన్సర్ (Sponsor) జీఆర్‌పీసీ మలేషియా. సహ స్పాన్సర్స్ డీఎస్‌ఎస్ సొల్యూషన్స్, మేపుల్‌ట్రీ సొల్యూషన్స్, స్ప్రౌట్ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎరుడైట్ స్కూల్స్, ఐడియాలాజిక్ టెక్నాలజీస్, కేవీటీ జ్యువెలర్స్, ఎన్‌ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మద్రాస్ బేకరీ, విందు ప్రాయోజకులు జాబిల్లి రెస్టారెంట్, మై బిర్యానీ హౌస్, వైట్‌ఫిన్స్ మై 81, శుద్ధవిలాస్, శ్రీ రుచి రెస్టారెంట్.

అధ్యక్షుడు (President) చోప్పరి సత్య (Choppari Satya), ఉపాధ్యక్షుడు భాను ముత్తినేని, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీ దాస్యం, ఖజాంచి రుద్రాక్షల సునీల్ కుమార్, సంయుక్త ఖజాంచి గజ్జడ శ్రీకాంత్, యువజన విభాగ నాయకుడు రుద్రాక్షల రవికిరణ్ కుమార్, మహిళా సాధికారత విభాగ నాయకురాలు గీత హజారే, కార్యవర్గ సభ్యులు సోప్పరి నవీన్, అపర్ణ ఉగంధర్, సాయిచరణి కొండ, రహిత, సోప్పరి రాజేష్, సురేఖ, ఆశ, రామ్, భార్గవ్, సింధుర, సంధ్య పాల్గొన్నారు

error: NRI2NRI.COM copyright content is protected