Hyderabad, Telangana, India: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) ఆధ్వర్యంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక (Silpakalavedika) లో ‘తానా పురస్కారాల ప్రదానోత్సవం’ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ (Telangana) రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన పది మంది ప్రముఖులను తానా ఈ వేదికపై ఘనంగా సత్కరించనుంది.
పురస్కార గ్రహీతలు – అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకులు డా. రామచంద్ర నాయుడు గల్లా, శ్రీ సుద్దాల అశోక్ తేజ (తానా అందె శ్రీ పురస్కారం), శ్రీమతి జమీలా నిషాత్, డా. సునితా కృష్ణన్: ‘శ్రీ జయధీర్ తిరుమల రావు, శ్రీ గడ్డం సమ్మయ్య, శ్రీ చింతకింది మల్లేశం, శ్రీ చింతల వెంకట్ రెడ్డి, శ్రీ దాసరి కొండప్ప తదితరులకు తానా పురస్కారాలు అందజేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) తెలిపారు.
తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali) ఆధ్వర్యంలో జరగనున్న తానా 25వ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) తదితర ప్రముఖులు హాజరవుతారని. తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తానా (TANA) ప్రతినిధులు హార్దిక ఆహ్వానం పలుకుతున్నారు.