Connect with us

Leadership

ఘనంగా తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం @ The Hindu Temple of Omaha

Published

on

Omaha, Nebraska, September 28, 2026: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (Nebraska) (TSN) 2026–2027 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం (Oath-taking Ceremony) ఘనంగా జరిగింది. ఒమాహా నగరంలోని హిందూ టెంపుల్ సోషల్ హాల్‌లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (Annual General Body Meeting)లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సమావేశాన్ని జనరల్ సెక్రటరీ అలగన్ కంచర్ల (Alagan Kancharla) గారు అద్భుతంగా నడిపించారు.

ఈ సందర్భంగా 2025–2026 కార్యవర్గం తన ఏడాది పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. సంస్థ మాజీ అధ్యక్షులు కొల్లి ప్రసాద్ (Kolli Prasad) గారు గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలపై సమగ్ర నివేదిక (Comprehensive Report) ను సభ్యులకు వివరించారు. ఆయన హయాంలో ఎమర్జెన్సీ ఫండ్, స్కాలర్‌షిప్స్, విమెన్ ఎంపవర్‌మెంట్, యూత్ కమిటీ వంటి పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వివిధ సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా నెబ్రాస్కాలోని తెలుగు సమాజానికి విశేష సేవలు అందించారు.

అనంతరం నామినేషన్ కమిటీ సభ్యులు రాజా కోమటిరెడ్డి (Raja Komatireddy) గారు, నూతన అధ్యక్షుడిగా తాతారావు కోసూరి (Tatarao Kosuri) గారిని ప్రతిపాదించగా, సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఇతర పదవులకు ఎంపికైన సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గం అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు బాధ్యతలు నిర్వహించనుంది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తాతారావు కోసూరి (Tatarao Kosuri) గారు మాట్లాడుతూ, గత కార్యవర్గం వేసిన బలమైన పునాదిపై మరిన్ని సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా “Back to Home” పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వైద్య సంస్థల (Medical institutions) తో కలిసి స్వస్థలాల్లో మెడికల్ క్యాంపులు (Medical Camps), హెల్త్ డ్రైవ్స్ (Health Drives) నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను తెలుగు ప్రజలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.

TSN 2026–2027 నూతన కార్యవర్గ వివరాలు:-
కోర్ కమిటీ (Core Committee)
President: తాతారావు కోసూరి
Vice President: సాంబ దివ్వెల
Secretary: రమేష్ రాయపాటి
Treasurer: యుగంధర్ పంగా
Cultural Secretary: వినీల నాయుడు
Joint Secretary: వీరేంద్రనాథ్ ముప్పవరపు
Joint Treasurer: బాల కామిరెడ్డి
Joint Cultural Secretary: నాగ స్వప్న అడగిరి
EC Members: ధన గొట్టిపాటి, అవినాష్ మదూరి, క్రాంతి సుధ, శ్రీమతి శ్రీదేవి కొరగంజి (లింకన్), నరేష్ కుమార్ తోడుకూరి, శంకర్ తలం, దత్తా రాజేష్ గుంటూరు

Board of Directors: అనూప్ మానిక్య, అనిల్ పోతినేని, రమ్య రవిపాటి, శ్రీమతి లక్ష్మీ మాధురి చిన్ని, చైతన్య రవిపాటి
Emergency Response Squad: ప్రసాద్ కొల్లి, సుందర మూర్తి చొక్కర, వెంకట్ రమేష్ స్వర్ణ
Scholarship Committee: సుందర మూర్తి చొక్కర, ఫణి తేజ్ అడిదం, మురళీధర్ చింతపల్లి
Youth Committee: క్రాంతి సుధ, వివేక్ పోశాల, వీణా మాధురి ద్రోణాదుల, మానస్వి పడాల, ఆర్య యర్లగడ్డ, అరుష్ పుటంబేకర్, సమన్వి కంటం, దీపిక సరవణన్, సుధాంశు చిందం, హరి.

తెలుగు బడి (Telugubadi) ఉపాధ్యాయులు: పవిత్ర గేదుపూడి (Pincpal), దివ్య ముక్క (Vice-Pricipal), వీణా మాధురి ద్రోణాదుల, అర్యాని సుహిత రాయ్ గోటూర్, సువర్ణ రేఖ కరుమంచి, సుధీర్ లంక, మౌనిక కుడికాల, తనూజ యెర్రమపుల, ఉమామహేశ్వర్ రెడ్డి యెద్దుల, రాజా కోమటిరెడ్డి, స్వప్న బురామోని, వేణు గోపాల్ మురకొండ, రవి కండాల, దత్తా రాజేష్ గుంటూరు, మాధవి ఎంజమూరి, ఝాన్సీ.

ప్రెసిడెన్షియల్ కమిటీలు:-
Advisory Committee: అనిల్ తాటి, అశోక్ ముద్గపల్లి, క్రాంతి అదిదం, సత్యనారాయ పావులూరి, మహేష్ గుదారు, సోమ శేఖర్ కొడాలి, నరేందర్ సామ, నాగరాజు ముదెల్లి, నవీన్ కంటెం, శరత్ బొడేపూడి, రాంబాబు కల్లేపల్లి, ప్రసాద్ కొల్లి, రాజా కోమటిరెడ్డి
Nominations Committee: ప్రసాద్ కొల్లి
Charity & Fund Raising – Lincoln: నీలిమ మంచికలపాటి, రమా జాస్తి, పద్మజ పదర్తి, ముఖేష్ యర్లగడ్డ, శ్రీమతి శ్రీదేవి కొరగంజి (లింకన్)
Charity & Fund Raising – Omaha: సత్యనారాయణ పావులూరి, నరేష్ కుమార్ తోడ్కూరి, అవినాష్ మదూరి, రాజా కోమటిరెడ్డి, ప్రసాద్ కొల్లి, తాతారావు కోసూరి, సాంబ దివ్వెల, అనూప్ మానిక్య, వేణు గోపాల్ మురకొండ

IT & PR: అలగన్ కంచర్ల, అవినాష్ మదూరి
Cultural: వినీల నాయుడు, నాగ స్వప్న అడగిరి, శ్రీమతి సుభాశ్రీ కొడూరు
Sports: బాల కామిరెడ్డి, కార్తీక్ వేపూరి (లింకన్), రమ్య రవిపాటి, కృష్ణ చైతన్య, నవీన్ కంటెం, జ్ఞానేశ్వర్ పున్న, యుగంధర్ పంగా, అలగన్ కంచర్ల, హనుమంతు నీలంరాజు
Food Committee: వెంకట్ సుమన్ మద్దుల, ధనారావ్ గొట్టిపాటి, జితిన్ నంది, అనిల్ పోతినేని, సుందర మూర్తి చొక్కర, సురేంద్ర ఖండవల్లి
Audit: సాంబ దివ్వెల, యుగంధర్ పంగా, రాజా కోమటిరెడ్డి, ప్రసాద్ కొల్లి, తాతారావు కోసూరి, అనూప్ మానిక్య, సత్యనారాయణ పావులూరి

సమావేశం ముగింపులో, మాజీ అధ్యక్షులు కొల్లి ప్రసాద్ గారు, నూతన అధ్యక్షులు తాతారావు కోసూరి గారు మాట్లాడుతూ, సమితి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు ముందుండి నడిపించినప్పటికీ, వాటి విజయాల వెనుక వివిధ కమిటీల సభ్యులు (Committe Members), వాలంటీర్లు (Volunteers), సమితి సభ్యులు సహా ఎంతోమంది సమిష్టి కృషి, సహకారం, అంకితభావం ఉన్నాయని పేర్కొన్నారు.

సమితి అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా, మొక్కవోని పట్టుదలతో అందిస్తున్న సేవలను అభినందించారు. సమితి కోసం సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించేందుకు ఆ మహాదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (Telugu Samiti of Nebraska – TSN) అంచెలంచెలుగా ఎదుగుతూ మరింత మందికి సేవలందించాలని ఆకాంక్షించారు.

error: NRI2NRI.COM copyright content is protected