St. Louis, Missouri: అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో NRI TDP విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (CBN) గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశంసాపత్రాలు అందజేశారు.
పసుపుదళం మరియు NDA కూటమి కార్యకర్తల కోలాహలం మధ్య జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు (NCBN) గారి జన్మదినాన్ని తమ ఇంటి పండుగలా జరుపుకోవడం చూస్తే, దేశం దాటినా పార్టీపై, చంద్రబాబు గారి కుటుంబంపై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
ఈ వేడుకల్లో NRI TDP సభ్యులు చెంచు వేణుగోపాల్ రెడ్డి (NRI TDP అధికార ప్రతినిధి), రాజా సూరపనేని (TANA రీజినల్ కోఆర్డినేటర్), సురేన్ పాతూరి (TANA సభ్యులు), కిషోర్ ఎర్రపోతిన, రవి పొట్లా, సుధాకర్ నర్రా, వంశీ పాతూరి, వీరా, నాగకుమార్ బెల్లంకొండ, వెంకట్ గౌని, మురళి పుట్టగంటి, జనసేన పార్టీ నాయకులు విజయ్ సాక్షి, సత్య తదితరులు పాల్గొన్నారు.
అలాగే వందల సంఖ్యలో కూటమి అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు చేపడుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు, అమరావతి నిర్మాణానికి NRIs తరఫున పూర్తి మద్దతు ఉంటుందని కూటమి సభ్యులు ఈ సందర్భంగా ప్రకటించారు.