ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (Telugu Association of North America), టెస్ట్ ప్రెప్ పండిట్స్ (Test Prep Pundits) సంస్థతో కలిసి అమెరికా వ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థుల కోసం Scholastic Assessment Test (SAT) ట్యూటరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు SAT పరీక్షకు మెరుగైన సన్నద్ధత సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా (TANA) వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో సుమారు $2000 విలువైన SAT కోచింగ్‌ను కేవలం $75 రిజిస్ట్రేషన్ ఫీజుతో అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం తెలుగు సమాజానికి మాత్రమే కాకుండా అమెరికాలోని అన్ని కమ్యూనిటీల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అన్నారు తానా (Telugu Association of North America) నాయకులు.
ఈ Scholastic Assessment Test (SAT) ట్యూటరింగ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 25, 2026 వరకు ప్రతి శుక్రవారం మరియు శనివారం ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. మొత్తం 16 గంటల శిక్షణతో పాటు 2 పూర్తి స్థాయి SAT ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు
అన్వర్: Test Prep Pundits సంస్థ స్థాపకుడు, హ్యూస్టన్ ISDలో AP Calculus AB/BC ఉపాధ్యాయుడు – గణిత శిక్షణ అందిస్తారు.
మిస్ రానా కొరన్: నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు, లాస్ వెగాస్‌లో 15 సంవత్సరాలకు పైగా బోధనా అనుభవం – ఇంగ్లీష్ రీడింగ్ శిక్షణ అందిస్తారు.
నబిల్: SAT/ACT ఇంగ్లీష్ బోధనలో 6 సంవత్సరాల అనుభవం కలిగిన ఉపాధ్యాయుడు – ఇంగ్లీష్ రైటింగ్ మరియు గ్రామర్ శిక్షణ అందిస్తారు. కోర్సులో భాగంగా 6 గంటల గణితం, 5 గంటల ఇంగ్లీష్ రైటింగ్, 5 గంటల ఇంగ్లీష్ రీడింగ్ తరగతులు ఉంటాయి. అదనంగా ఏప్రిల్ 1, 2026న ప్రారంభ ప్రాక్టీస్ టెస్ట్ మరియు ఏప్రిల్ 26, 2026న ఫైనల్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ నిర్వహించి విద్యార్థుల సిద్ధతను పరీక్షిస్తారు.
ఇప్పటికే తానా మరియు Test Prep Pundits కలిసి నిర్వహించిన SAT ట్యూటరింగ్ కార్యక్రమాల ద్వారా సుమారు 2000 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాల ద్వారా సేకరించిన నిధుల ద్వారా $100,000కు పైగా నిధులు తానా ‘రైతు కోసం’ (TANA Rythu Kosam) కార్యక్రమానికి సమకూర్చి భారతదేశంలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ పరికరాలను అందించారు .
విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా (TANA) నాయకులు తెలిపారు. అమెరికాలోని తల్లిదండ్రులు మరియు హైస్కూల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిజిస్టర్ చేసుకోవాలని తానా (TANA) విజ్ఞప్తి చేసింది. https://events.tana.org/event/sat-spring-2026