Connect with us

Concert

వినోదానికి పెద్ద పీట, 3 భారీ లైవ్ కాన్సర్ట్స్ @ NATS Convention; DSP, Thaman, Naatu Band

Published

on

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) రెండేళ్లకోసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలలో మన తెలుగు భాష, కళలు, సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేయడం పరిపాటి. అంతే సమానంగా వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.

ఇక 8వ అమెరికా తెలుగు సంబరాలలో అయితే డోసు ఇంకా పెంచుతున్నారు. ఈ సంవత్సరం జులై 4,5,6 తేదీల్లో ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోని టాంపా (Tampa) మహానగరంలో నిర్వహించనున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలలో ముగ్గురు ఉద్దండుల లైవ్ కాన్సర్ట్స్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సారి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ (Gandham Devi Sri Prasad – DSP) మరియు తమన్‌ (Ghantasala Sai Srinivas Sivakumar – SS Thaman) తమ లైవ్ కాన్సర్ట్స్ తో ప్రత్యేకంగా అలరించనున్నారు. కన్వెన్షన్ రెండో రోజు జులై 5న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన ట్రూప్ లో 40 మందితో సంగీత ప్రపంచంలో అభిమానులు తేలియాడేలా పెర్ఫామ్ చేయనున్నారు.

అలాగే వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళుతున్న టాలీవుడ్ బాద్షా తమన్‌.. హై వోల్టేజ్ పాటలతో కన్వెన్షన్ మూడో రోజు జులై 6న అంతులేని ఆనందాన్ని పంచేలా సంగీత విభావరికి ప్రణాళిక రచిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ లైవ్ కాన్సర్ట్స్ తో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు ప్రవాసులకు చక్కని అనుభూతిని అందించనున్నాయి.

అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ అంటూ బ్యాండ్ ఫ్యూజన్ వారు జులై 4 బాంక్వెట్ డిన్నర్ రోజున పెర్ఫార్మ్ చేయనున్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఈ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని నాట్స్ సంబరాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) మరియు నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) కోరారు.

సమ్మర్ లో చక్కని వాతావరణంలో సేద తీరేటువంటి టాంపా (Tampa, Florida) నగరంలో నాట్స్ (North America Telugu Society – NATS) భారీ ఎత్తున నిర్వహిస్తున్న 8వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం www.sambaralu.org ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected