2023-25 కాలానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) కార్యవర్గ ఎన్నిక కోసం మొదటిసారి మోగిన ఎలక్షన్ నగరా పలు మలుపులు తిరిగి చివరికి క్యాన్సిల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అనంతరం తానా బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా నియమించిన కార్యవర్గాన్ని కోర్టు రద్దు చేసింది.
దీంతో ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండోసారి ఎలక్షన్ (Election) నగరా మోగింది. నిన్న అక్టోబర్ 31 రాత్రి నలుగురు సభ్యులతో కూడిన నామినేషన్స్ & ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా తానా (Telugu Association of North America) లో ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్దతి ప్రవేశపెడుతున్నారు.
ఈ ఎన్నికల ద్వారా 4 గురు బోర్డు సభ్యులను, 29 మంది కార్యనిర్వాహక సభ్యులను మరియు 7 గురు ఫౌండేషన్ సభ్యులను తానా సభ్యులు ఎన్నుకుంటారు. మరిన్ని వివరాలకు తానా ఎలక్షన్ వెబ్సైట్ www.NRI2NRI.com/TANA 2023 Election ని సందర్శించండి. అలాగే మీకు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే www.NRI2NRI.com/TANA Voters List లో చెక్ చేసుకోండి.
2023 అక్టోబర్ 31 నుండి 2024 జనవరి 14 వరకు సాగే ఎలక్షన్ (TANA Elections) పోరులో హేమాహేమీలు ఎవరెవరు నామినేషన్ వేస్తారో తెలియాలంటే నామినేషన్స్ చివరి తేదీ అయిన నవంబర్ 16 వరకు ఆగాల్సిందే. అలాగే వచ్చే 2024 సంక్రాంతి పండుగ రోజున విజేతలెవరో తేలిపోతుంది.
NOMINATIONS / ELECTIONS SCHEDULE Publication of Election Schedule: Tuesday October 31, 2023 Last date for receipt of nominations: Thursday, November 16, 2023 Approval of nominations/notification to candidates: Wednesday, November 22, 2023 Last date for withdrawal of nominations: Thursday, November 30, 2023 Publication/notification of final list of Nominations: Sunday, December 3, 2023 Final day to submit Election Flyers: Wednesday, December 6, 2023 Ballot mailing by USPS 1st class: Friday, December 15, 2023 Last date by which ballots must be received: Wednesday January 10, 2024 Ballot Counting: Saturday, January 13, 2024 Certification/ Publication of election results Sunday: January 14, 2024