Connect with us

Hiking

TANA @ New Jersey: ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిన హైకింగ్ @ Sourland Mountain Hiking Trail

Published

on

ఆహ్లాదకరమైన వాతావరణంలో, తానా న్యూజెర్సీ (TANA New Jersey Chapter) విభాగం నిర్వహించిన హైకింగ్ ఈవెంట్ శనివారం ఉదయం సౌర్లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్ (Sourland Mountain Hiking Trail) హిల్స్ బరో లో ఘనంగా జరిగింది. 100 మందికి పైగా సభ్యులు మరియు కుటుంబాలు పాల్గొని ప్రకృతిలో నడకను ఆస్వాదించారు. ఈ కార్యక్రమం ఆరోగ్యం, మానసిక ఉల్లాసం మరియు ప్రకృతితో బంధాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.

తానా నాయకత్వం “మన యువత – మన వారసత్వం” అనే నినాదాన్ని గుర్తు చేస్తూ, యువత ముందుండి నేతృత్వం వహించినందుకు ఆనందాన్ని వ్యక్తంచేసింది. ఈ తరహా కార్యక్రమాలు అమెరికాలో భారత (Telugu People) వారసత్వాన్ని, సాంస్కృతిక విలువలను, సేవా కార్యక్రమాలను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడతాయని పేర్కొంది.

తానా యూత్ (TANA Youth) కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి (Srinivas Cherukuri) మరియు హైకింగ్ కోఆర్డినేటర్ దశరథ తలపనేని పాల్గొన్న అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. “ప్రతిఒక్కరి ఉత్సాహం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైంది” అని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైకింగ్ కోఆర్డినేటర్ దశరథ తలపనేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి కార్యక్రమంలో పాల్గొన్న తానా లీడర్షిప్ ఫౌండేషన్ ట్రస్టీలు (TANA Foundation Trustees) శ్రీనివాస్ ఒరుగంటి, సతీష్ మేకా, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్‌చంద్ నరేపాలేపు, కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వాలంటీర్లు (Volunteers) శ్యామ్ ప్రసాద్ అంబటి, శరత్ తాటిపాముల, రాజేష్ బాబు, వినయ్ కూచిపూడి, మధుకుమార్ పరిటాల, రవి చెరుకూరి, నిశాంత్ కొల్లి, భగత్ మారెళ్ల, రవి మోసం, రాజేష్ ముప్పూర్, అరవింద్ పీఠంపల్లి, వెంకట్ ఏట్రింతల, మూర్తి తమ్మినీడి, వసంత్ నాయుడు తన్న, కిరణ్ బాసన, భాను ప్రకాష్ నల్లమోతు, వెంకట పుసులూరి, శ్రీనివాస్ కురివెళ్ల, శివ ప్రసాద్ అతినారపు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.

తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali) మరియు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు (Srinivas Lavu) పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, స్థానిక నాయకత్వానికి శుభాకాంక్షలు పంపించారు. కార్యక్రమం అనంతరం ఆహార్ రెస్టారెంట్ (Aahar Restaurant) వారు రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అందించటం జరిగింది.

error: NRI2NRI.COM copyright content is protected