Connect with us

Politics

వాషింగ్టన్ డీసీలో ఘనంగా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published

on

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. సతీష్ వేమన మాట్లాడుతూ… 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నాలుగు వసంతాలు పూర్తిచేసుకుంది.

పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగు బావుటాను ఎగురవేసిన యుగపురుషుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదిస్తూ పేదల జీవితాలకు పెన్నిధిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా, బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రవాసాంధ్రులు అండగా ఉంటామని తెలిపారు. తెలుగుదేశం గెలిచింది 4 శాసనమండలి స్థానాలు అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను బాగా ప్రాభావితం చేశాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బాగా పెరిగింది. అధికార పార్టీకి, ప్రభుత్వ అధికారులకు ఇదొక హెచ్చరిక అని అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… తెలుగుదేశం పేదల గుండెచప్పుడు, ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం జాతీయ రాజకీయాలను ప్రాభావితం చేసింది. తెలుగుజాతికి మార్గదర్శం చేసి, రాష్ట్ర ప్రగతికే సారథిగా, ప్రజారంజక పాలన చేసిన మహానాయకుడు ఎన్‌టి‌ఆర్. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడారు.

దుష్ట పాలనను అంతమొందించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేటి దుష్టపాలనను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. ఇదే ఆయనకు నిజమైన నివాళి. శాసనమండలి ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీకి కీలక మలుపు అని అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందన్నారు.

భాను మాగులూరి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఎన్టీఆర్ తపన, ఆశయం, ఆవేశం నుంచి పార్టీ ఆవిర్భించింది. తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే ఎవరికీ సాధ్యం కాని విజయాలు సాధించింది. వాషింగ్టన్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, జానకిరామ్ భోగినేని తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కార్తీక్ కోమటి, జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షలు కృష్ణ లాం, రమేష్ గుత్తా, సత్య సూరపనేని, శ్రీనాథ్ రావుల, రాము జక్కంపూడి, రమాకాంత్ కోయ, రవి అడుసుమిల్లి, చంద్ర మాలావతు, సుశాంత్ మన్నే, విజయ్, ప్రదీప్ గుత్తా, హనుమాన్ యంపరాల, కిషోర్ కంచర్ల, ప్రసాద్, వట్టికూటి, సాయి బొల్లినేని, రామకృష్ణ ఇంటూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected