Atlanta, Georgia: వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh), ఇది వాసవి మాత ఆదర్శాలతో స్థాపించిన సేవ సమస్తా, ధర్మం, శీలం మరియు అహింస మార్గాలను ఎంచుకొని ఆధునిక సమాజ స్థాపనకు తోడ్పడుతున్న సేవా సంస్థ. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు అది కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంభందం లేకుండా, దేశాలకు సంభందం లేకుండా నవ సమాజ స్థాపన కొరకు కంకణం కట్టుకొన్న ఏకైక సేవా సమస్త .” వసుధైక కుటుంబమే వాసవి సేవా సంఘ్ లక్ష్యం”.
దైవ చింతన మరియు సేవా తత్పరనే మార్గంగా ఎంచుకొని అన్నదాన కార్యక్రమాలు (ఫుడ్ డొనేషన్), ఆర్తులకు దుప్పట్ల పంపిణి (బ్లాంకెట్స్ డొనేషన్),రక్త దానం (బ్లడ్ డొనేషన్),విద్య దానం (ఎడ్యుకేషన్ సపోర్ట్) మరియు మహిళా సాధికారత కొరకు కృషి చేస్తున్న ఏకైక సేవా సంస్థ గా వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) ను తీర్చి దిద్దడానికి నిరంతర సాధన జరుగుతుంది.
సమాజంలో ఆర్య వైశ్యులు అనగానే వివిధ రకాలైన వ్యాపారాలతో, కచ్చితమైన నిబద్ధతో పనిచేయడమే కాకుండా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది డాక్టర్లు (Doctors), ఇంజినీర్లు (Engineers) మరియు రాజకీయ నాయకులు (Politicians) కూడా ఉన్నారు. నవ సమాజ స్థాపనలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఆర్య వైశ్యులు.
కాని ఇంకా సరైన గుర్తింపు లేకుండా అమెరికా లోని కుల ప్రాతిపదిక మీద ఏర్పడిన ఎన్నో సంఘాలు తప్పుడు మార్గాలను అనుసరిస్తున్న సమయంలో వారితో ఇమడలేక, సరైన వాసవి మాత ఆదర్శాలతో ముందుకు వెళ్తూ కులభేదం, మత బేధం లేకుండా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి సమయ స్పూర్తితో ముందుకు వెళ్తూ శాంతి మరియు అహింస లాంటి గాంధీ మార్గాన్ని ఎంచుకొని నడుస్తున్న ఏకైక సేవ సమస్త గా వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) పని చేస్తుంది.
ముఖ్యంగా యువతను ప్రోత్సహాస్తూ వారిని భవిష్యత్తు లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు పెట్టుకునే విధంగా ముందుకు వెళ్తూ, సంక్రాంతి (Sankranti Festival) సంబరాలు అనే సామూహిక పండుగ వాతావరణంలో అట్లాంటా (Atlanta, Georgia) నగరంలో జరిగిన కార్యక్రమాలలో వేలమంది పాలుగొని జయప్రదం చేయడం జరిగింది.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు మరియు పెద్దలు తమ కళలను ప్రదర్శించంతో పాటు, ప్రముఖ గాత్ర కళాకారులచేత పాటల కచేరి ఉర్రుతలుంగించడం జరిగింది. ఆసాంతం ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకలో మంచి రుచికరమైన భోజనాలు మరియు వెండార్ స్టాల్ల్స్ తో వేదిక అంత కోలాహలంగా మారింది.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జరిగిన ముగ్గుల పోటీలు, చిల్డ్రెన్స్ పెయింటింగ్స్, గాలి పటాల పోటీ మరియు వివిధ రకాలైన ఆసక్తికర పోటీలను నిర్వహించి బహమతులను అందజేశారు. Forsyth కౌంటీ కమిషనర్ Todd Levance కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. భారతీయ పిండి వంటలను మరియు భారతీయ భోజనాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు.
భవిష్యత్తులో కూడా Vasavi Seva Sangh జరుపబోయే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్న వారి కోసం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం, వాసవి మాత జయంతి, సమ్మర్ పిక్నిక్, మహిళా సాధికారిక (Women Empowerment) దినోత్సవం, దసరా బతుకమ్మ సంబరాలు లాంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను రూపందించడం జరిగింది.
భవిషత్తు తరాలు మన సంప్రదాయాలను గుర్తు పెట్టుకోవాలి అన్నదే వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) లక్యం. సంక్రాంతి పండుగని జయప్రదం చేసిన కమిటీ సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటుంది “వాసవి సేవా సంఘ్ బోర్డ్ కార్యవర్గం”.