భారతదేశం వెళ్లిన తెలుగు ప్రవాసులు తిరుమలలో కొలువైన ఆ శ్రీవేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోని వారు ఉండరు. ఇండియా ట్రిప్ లో ప్రవాసులకు (NRIs) టైం చాలా తక్కువుంటుంది. ఈ తక్కువ టైంలో శ్రీవారిని దర్శించుకోవడం కొంచెం వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియగా మారింది.
అందువలన తిరుమల (Tirumala, Tirupati) ఎన్ఆర్ఐ కోటా దర్శనంలో ఎన్ఆర్ఐలకు భారతదేశంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులతో కలిసి దివ్య దర్శనం చేసే సౌలభ్యం కల్పించాలి అంటూ తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) ప్రతిపాదన చేశారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) ఉత్తర అమెరికాలో నివసించే తెలుగు ప్రజల కోసం సేవలు అందిస్తూ, వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాష మరియు శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ.
తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) గారికి, మరియు ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాల మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) గారికి, తిరుమల ఎన్ఆర్ఐ కోటా దర్శనం విధానంలో సవరణ చేయాలని ప్రతిపాదన లేఖను సమర్పించారు.
ఈ ప్రతిపాదన ప్రకారం, ఎన్ఆర్ఐ (NRIs) లకు ప్రస్తుతం లభించే దర్శనంలో ఉన్న తాత్కాలిక పరిమితులు తొలగించి, ఎన్ఆర్ఐ తో పాటు భారత దేశంలో నివసిస్తున్న నలుగురు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే సౌకర్యం కల్పించాలని, ఎన్ఆర్ఐ భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తి పూర్వకంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఇవ్వాలని కోరటం జరిగినది.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు శ్రీ జయరాం కోమటి (Jayaram Komati) గారు పాల్గొని, ఈ సవరణ ఆవశ్యకతను స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, మరియు ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాల మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సహేతుకంగా వివరించి ఎన్ఆర్ఐ భక్తులు కుటుంబంతో కలిసి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.
ఈ సవరణ ద్వారా ఎన్ఆర్ఐ (Non Resident Indian – NRI) భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తి పూర్వకంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందని, తాత్కాలిక పరిమితులు తొలగి దైవ దర్శనం మరింత సాఫీగా సాగుతుందని సాయి బొల్లినేని (Sai Bollineni) తెలిపారు.
ఈ సవరణ దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తో కలిసి పని చేయడానికి తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ టీం (TANA Membership Benefits Team) సిద్ధంగా ఉందని తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని స్పష్టం చేశారు.
ప్రస్తుత దర్శన పద్దతి