Connect with us

Elections

ఇద్దరు Telangana NRIs ఓటు కథ; ఒక్కో ఓటు విలువ 2 లక్షలు

Published

on

అమెరికాలో ఉద్యోగరీత్య ఉంటున్న విలాస్ రెడ్డి, జలగం సుధీర్ లు మంచి మిత్రులు. విలాస్ రెడ్డి విద్యార్ది దశ నుండే బిజెపి (Bharatiya Janata Party) లో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుత Telangana ఎలక్షన్ లలో ఇబ్రహీంపట్నం BJP టికెట్ ఆశించారు. అనేక సమీకరణాల ద్రుష్ట్య టికెట్ రాలేదు.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గుర్తింపు ఉన్నప్పటికి తెలంగాణ రాజకీయాల్లో ఓటు వేయటం తో వచ్చె ఆనందం వేరు అని నవంబర్ 30 న జరిగే తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళుతున్నారు. సెలవు సీజన్ కావటం తో విమాన చార్జిలు సుమారు 2 లక్షలకు పైగానే ఉన్నాయి. విలాస్ జంబుల (Vilas Reddy Jambula) గతం లో లక్షల్లో ఖర్చు పెట్టి ఓటు కోసం ఇండియా వెల్లిన సంధర్భాలు ఉన్నాయి.

అలాగే కోదాడ కు చెందిన జలగం సుధీర్ కూడ BRS పార్టి నుండి MLA టికెట్ ఆశించి ఒక దశలో అమెరికా నుండే ఆన్లైన్ లో నామినేషన్ దాఖలు చేసి తెలంగాణ లో మొట్టమొదటి ఆన్లైన్ నామినేషన్ వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కెటీఅర్, కవిత లతో తనకున్న పరిచయం తో 2014 మరియు 2018 లో కోదాడ MLA టికెట్ కోసం ప్రయత్నం చేస్తు కోదాడ ప్రాంతం లో సుమారు 100 సమస్యల మీద పనిచేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

టికెట్ వచ్చిన, రాకున్న ఎలక్షన్ (Telangana Assembly Elections) లలో ఓటు వేయటం కోసం ఏ దేశం లో ఉన్నా కోదాడ కు వచ్చి ఓటు వేయటం సుధీర్ (Sudheer Jalagam) కు అలవాటు. విమాన చార్జిలు రాను పోను కలిపి 2 లక్షల రుపాయలు ఉన్నప్పటికి సుధీర్ తనకు ఓటు వేయటమే ముఖ్యమని బావిస్తున్నారు.

గతంలో 2004 లో కెనడా నుండి, 2009 లో అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన సంధర్భాలు గుర్తుకు తెచ్చుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సుధీర్. ఇద్దరు మిత్రులు వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికి తమ ఓటు వినియోగించుకోవటంలో ఒకటే ఆలోచన చేయటం ప్రవాస తెలంగాణ (Telangana) వాదుల్లో చర్చ జరుగుతుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected