Connect with us

Elections

టీం వేమూరి ఎన్నికల ప్రచారం, తానా సభ్యులతో ముఖాముఖి @ Delaware

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) 2023 – 25 కాలానికి జరుగుతున్న ఎలక్షన్స్ లో ప్రచారం ఊపందుకొంది. బాలట్స్ వచ్చే సమయం దగ్గిర పడే కొద్దీ కాంపెయిన్ లో టీం వేమూరి (Team Vemuri) దూకుడు పెంచింది.

ఇందులో భాగంగా గత వారాంతం డెలావేర్ (Delaware) లో తానా సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. తానా (Telugu Association of North America) లో ప్రస్తుతం ఏం జరుగుతుంది, తమకే ఎందుకు వోట్ వెయ్యాలి వంటి విషయాలను వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమాలను తానా మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి (Jay Talluri), తానా ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu) మరియు ఈ ఎన్నికల్లో గా పోటీచేస్తున్న ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి సతీష్ వేమూరి (Sateesh Vemuri) లీడ్ చేస్తున్నారు.

వీరితోపాటు పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు శ్రీనివాస్ ఉయ్యూరు, అశోక్ కొల్లా, సత్యనారాయణ మన్నే, శిరీష తూనుగుంట్ల, సుమంత్ రాంశెట్టి, వంశీ వాసిరెడ్డి, శ్రీరామ్ ఆలోకం, భాస్కర్ మల్లినేని మరియు సపోర్టర్స్ లక్ష్మణ్ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected