Connect with us

Cultural

తానా జాతీయ సాంస్కృతిక పోటీలలో వెల్లివిరిసిన తెలుగుతనం @ Raleigh, North Carolina

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ జాతీయ సాంస్కృతిక పోటీలు ఇలినాయస్‌లోని నాపర్విల్ (Naperville, Illinois) లో గత ఆగస్టులో ప్రారంభమయ్యి నవంబర్ 2న నార్త్ కరోలినా రాష్ట్రం లోని ర్యాలీ (Raleigh, North Carolina) నగరంలో పెద్ద ఎత్తున ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల (Suresh Kakarla), టాలీవుడ్ నటి మరియు నిర్మాత శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీపావళి వేడుకలలో భాగంగా తానా జాతీయ సాంస్కృతిక పోటీల ఫైనల్స్ నిర్వహించి బహుమతులు, ట్రోఫీలు అందించారు.

ఈ సాంస్కృతిక పోటీలలో భాగంగా ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు (Classical Dances) కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉన్నాయి. చక్కని అభినయంతో తెలుగుతనం వెల్లివిరిసేలా ర్యాలీ (Raleigh) నగర కళాకారులు అందరినీ మంత్రముగ్దులను చేశారు. పలువురు గాయనీగాయకులు తమ గాత్రంతో ఔరా అనిపించారు.

వాయిస్ ఆఫ్ తానా, తానా అల్టిమేట్, డాన్స్ ఛాంపియన్స్, తానా డాన్స్ జోడి అంటూ పలు కేటగిరీస్ లో ఈ తానా జాతీయ సాంస్కృతిక పోటీలు (TANA Cultural Competitions) నిర్వహించారు. ఈ పోటీల కోసం వేదికను అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, షాపింగ్ స్టాల్స్, ర్యాఫుల్ ప్రైజెస్, ఆటపాటలతో ఆహ్వానితులను అలరించారు. ఈ కార్యక్రమానికి సౌమ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన వాక్‌చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంది. తానా కల్చరల్ కోఆర్డినేటర్ డా. ఉమ ఆరమండ్ల కటికి చికాగో (Chicago) నుంచి ఈ జాతీయ సాంస్కృతిక పోటీల ఫైనల్స్ కోసం ర్యాలీ విచ్చేశారు.

తానా అపలాచియన్ రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మరియు ఇతర తానా (TANA) నాయకులు పాల్గొన్నారు. సురేష్ కాకర్ల, శివాని రాజశేఖర్ చేతులమీదుగా మెమెంటోలు అందజేశారు.

క్లాసికల్ మరియు నాన్ క్లాసికల్ విభాగాలలో జరిగిన ఈ TANA పోటీలకు విశేష స్పందన లభించింది. నిత్య గింజుపల్లి, హేమ దాసరి, మిథున్ సుంకర, బాల గర్జల, వెంకి అడబాల, వినోద్ కాట్రగుంట, అన్వేష్ బొల్లం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో లీడ్ రోల్ ప్లే చేశారు. అలాగే పలువురు వాలంటీర్స్ (Volunteers) చేసిన సహాయం మరువలేనిది.

ఈ సందర్భంగా రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ… ఈ పోటీలలో పాల్గొన్నవారు ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రదర్శనలతో కార్యక్రమానికి వన్నె తెచ్చారని కొనియాడారు. విజేతలకు, పార్టిసిపెంట్స్ కి అభినందనలు తెలిపారు. ఈ పోటీలు ఎందరినో ఇన్స్పైర్ చేస్తాయని, జడ్జెస్, పార్టిసిపెంట్స్ పేరెంట్స్, స్పాన్సర్స్, కోఆర్డినేటర్స్, వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ఎమ్మెల్యే సురేష్ కాకర్ల మాట్లాడుతూ… పిల్లలు మన సంస్కృతీసంప్రదాయాలు మర్చిపోకుండా ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. ఒకప్పుడు తను తానా (TANA) లో చేసిన సేవలను, వివిధ కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా కూడా తానా ర్యాలీ టీం (TANA Raleigh Team) ఒకే ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అభినందించారు.

స్థానికంగా పలువురు ఈ పోటీలకు స్పాన్సర్స్ గా వ్యవహరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఈ కార్యక్రమం చక్కని పండుగ భోజనాలతో విజయవంతంగా ముగిసింది. టాలెంట్, సంస్కృతి, తెలుగుతనంతో నిండిన కార్యక్రమంగా తానా (Telugu Association of North America – TANA) చరిత్రలో నిలిచిపోతుంది.

error: NRI2NRI.COM copyright content is protected