Connect with us

Events

న్యూజెర్సీలో మాతృమూర్తి గొప్ప‌త‌నాన్ని ప్ర‌తిబింబించేలా తానా మదర్స్ డే సెలబ్రేషన్స్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 6 న స్థానిక ఈ హోటెల్ బ్యాంక్వెట్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో నిర్వహించిన సెలబ్రేషన్స్ కి దాదాపు 700 మంది కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

తానా న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ వంశీ వాసిరెడ్డి ఆధ్వ‌ర్యంలో తానా న్యూజెర్సీ కార్య‌వ‌ర్గం మ‌ద‌ర్స్ డే ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. స్థానిక తానా నాయకత్వం ల‌క్ష్మీ దేవినేని, రాజా క‌సుకుర్తి, సమన్వయకర్తలు శివానీ త‌న్నీరు, బిందు ల‌క్ష్మి ప్రసన్న, రామక్రిష్ణ వాసిరెడ్డి, రత్న ముల్పూరి తోడ్పాటు అందించారు. వంశీ స్వాగతోపన్యాసంలో భాగంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలపగా, ప్రార్థనా గీతంతో కార్యక్రమం మంగళకరంగా ప్రారంభమైంది.

అమ్మను కీర్తిస్తూ పాడిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ స్టాల్ల్స్, ఫోటో బూత్ మరియు ర్యాఫుల్ బహుమతులు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లల కొరకు ప్రత్యేకంగా నిర్వహించిన సరదా ఆటలు వారిని ఆహ్లాద‌ పరిచాయి. చక్కని అలంకరణతో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ వద్ద అందరూ ఫోటోలు దిగుతూ సందడి చేశారు. అలాగే మహిళలు స్టాల్ల్స్ లో తమకు ఇష్టమైన షాపింగ్ చేస్తూ కనిపించారు.

తెలుగు సినీ నటి పూజ ఝవేరి ప్రత్యేక నృత్య ప్రదర్శనతో కార్యక్రమానికి ఊపు తెచ్చింది. కొందరు మ‌హిళ‌లు హుషారుగా తమ క‌ట్టూ బొట్టూ ప్ర‌ద‌ర్శిస్తూ నిర్వహించిన ఫ్యాష‌న్ షో తో అందరి మన్ననలు పొందారు. ప్ర‌ముఖ గాయ‌ని సుమంగ‌ళి తన సుమ‌ధుర గీతాల ఆలాపనతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.

అనంతరం తానా పాఠ‌శాల కార్య‌క్ర‌మానికి విశేష సేవ‌లు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘ‌నంగా స‌న్మానించారు. వివిధ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన మహిళలకు బ‌హుమ‌తులుగా డైమండ్ రింగ్స్‌, చీర‌లు అంద‌జేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు. తెలుగు వారి అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు రుచికరమైన భోజ‌నాల‌ను బిర్యానీ జంక్షన్ రెస్టారెంట్ వారు ఏర్పాటు చేశారు.

మన టీవీ యాంకర్ లావణ్య గూడూరు చమత్కారంతో కూడిన వ్యాఖ్యానం బహు బాగుంది అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఇకపోతే ఓ వైపు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ఆహుతులు హాజరవడం చూస్తే ఈ కార్యక్రమం ఎంత పెద్ద విజయవంతమో తెలుస్తుంది. ఎన్నారై స్ట్రీమ్స్ వారు ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ కార్యక్రమానికి వన్నె తెచ్చింది.

తానా మ‌ద‌ర్స్ డే వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా హాజరైన ఎడిస‌న్‌ నగర మేయ‌ర్ శామ్ జోషి, టీవీ 5 సీఈఓ శ్రీధర్ చిల్లర మరియు ఉపేంద్ర చివుకుల ప్రసంగాల అనంతరం తానా కార్యవర్గం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై స్ట్రీమ్స్, అవాన్స ఐటీ సొల్యూషన్స్, న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉషా కృష్ణ కుమారి, హాల్మార్క్ గ్లోబల్, ఆప్టివ కార్ప్, మూవర్స్.కామ్, అస్త్ర సర్ఫేసెస్, రవి పొట్లూరి మరియు వైరా జువెలర్స్ సమర్పకులు.

వివిధ నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తానా నాయకులలో జయ్ తాళ్లూరి, నిరంజ‌న్ శృంగ‌వ‌ర‌పు, వెంక‌ట‌ ర‌మ‌ణ యార్ల‌గ‌డ్డ‌, స‌తీష్ వేమూరి, హరీష్ కోయ, అశోక్‌బాబు కొల్లా, ముర‌ళి తాళ్లూరి, హితేష్ వ‌డ్ల‌మూడి, శ్రీని య‌ల‌వ‌ర్తి, శ్రీనివాస్‌ ఉయ్యూరు, సునీల్ కోగంటి, శ్రీకాంత్ పోల‌వ‌ర‌పు, ర‌వి సామినేని, సుమంత్ రామిశెట్టి, విశ్వ‌నాథ్ నాయునిపాటి, ర‌మాకాంత్ కోయ‌, శ్రీనివాస్ ఓరుగంటి, విద్య గార‌పాటి, ర‌వి దొడ్డ‌, శేఖ‌ర్ బొల్లిన‌, స‌తీష్ మేక, కిర‌ణ్ కొత్త‌ప‌ల్లి, స‌తీష్ తుమ్మ‌ల‌, భాస్కర్ మలినేని, లక్ష్మణ్ పర్వతనేని, కిశోర్, పద్మజ బెవర, అనిత మన్నవ ప్రముఖులు.

ఇంత చక్కని ఆహ్లాదకరమైన కార్యక్రమం ద్వారా మాతృమూర్తుల గొప్ప‌త‌నాన్ని ప్ర‌తిబింబించేలా మదర్స్ డే నిర్వహించిన న్యూజెర్సీ తానా నాయకత్వాన్ని ఆహుతులందరూ అభినందించారు. చివరిగా వందన సమర్పణలో భాగంగా స్పాన్సర్స్, తానా లీడర్షిప్, మీడియా మరియు ఆహూతులకు తానా న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ వంశీ వాసిరెడ్డి ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected