Connect with us

Elections

ఆసక్తికర వ్యాఖ్యలతో మాజీ అధ్యక్షులు & టీం స్క్వేర్ ఫౌండర్ endorsed Team Kodali

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ఎన్నికలలో ఆసక్తికర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఎలక్షన్ మొదలు తేదీ దగ్గిర పడడంతో రెండు ప్యానెల్ వాళ్ళు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ఇందులో భాగంగా టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ ఎవరూ ఊహించని మద్దతు దక్కించుకుంది. గత 8 సంవత్సరాలుగా తానా (TANA) కి దూరంగా ఉంటున్న తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని (Mohan Nannapaneni) నిన్న టీం కొడాలి ప్యానెల్ ఆహ్వానం మేరకు బోస్టన్ నగర (Boston, Massachusetts) ప్రచార సభలో పాల్గొన్నారు.

అంతే కాకుండా లెట్స్ రివైవ్ తానా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న నరేన్ కొడాలి సారధ్యంలోని టీం కొడాలి ప్యానెల్ కి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నరేన్ కొడాలి, మోహన్ నన్నపనేని (Mohan Nannapaneni) ని ఆత్మీయ ఆలింగనం చేసుకొని సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

నరేన్ కొడాలి తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యూ ఇంగ్లండ్ రీజినల్ రిప్రజంటేటివ్ పదవికి పోటీ చేస్తున్న కృష్ణ ప్రసాద్ సోంపల్లి (KP Sompally), కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న రాజా కసుకుర్తి (Raja Kasukurthi) మరియు ఫౌండేషన్ ట్రస్టీ గా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు ఎండూరి (Srinivasa Rao Yenduri) ల పేర్లు కూడా చెప్తూ ఎండోర్స్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా మోహన్ నన్నపనేని ప్రసంగిస్తూ … తను తానా (TANA) అధ్యక్షులుగా ఉన్నప్పుడు నరేన్ కొడాలి బోర్డు ఛైర్మన్ గా ఉన్న పరిస్థితులను గుర్తు చేశారు. అలాగే 2007 లో నరేన్ (Naren Kodali) తానా వెబ్సైట్ కి సంబంధించిన పనులు చేస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన సేవలు, అలాగే సంస్థ పరంగా భిన్నాభిప్రాయాలు వంటి అంశాలను సైతం గుర్తు చేసుకున్నారు.

తానా మాజీ అధ్యక్షునిగానే కాకుండా, తన హయాంలో టీం స్క్వేర్ (TANA Emergency Assistance Management Team – TEAM Square ) అంటూ ఒక వింగ్ ని ఏర్పాటుచేసి తానా తరపున ఎమర్జెన్సీ విషయాల్లో సేవలందించించేలా మోహన్ నన్నపనేని చేసిన కృషి మరువలేనిది.

ఈ రోజు టీం స్క్వేర్ (TEAM Square) అమెరికాలోని తెలుగువారికి ఆపద్భాంధవునిలా తోడ్పడుతుంది. అటువంటి వ్యక్తి మరియు శక్తి (Mohan Nannapaneni) బయటికి వచ్చి ఓపెన్ గా ఎండోర్స్ చేయడం టీం కొడాలి ప్యానెల్ (Team Kodali Panel) కి మంచి శక్తి నిచ్చిందనే చెప్పాలి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected