రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారికి తన సేవా కార్యక్రమాలతో పరిచయం అక్కరలేని వ్యక్తి, తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) గారు. తానా అధ్యక్షునిగా రికార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా తన టర్మ్ పూర్తి చేశారు.
Anjaiah Chowdary Lavu TANA President, 2021-23
ప్రస్తుతం జరుగుతున్న తానా (TANA) ఎన్నికలలో సంస్థ ప్రయోజనాల రీత్యా నరేన్ కొడాలి (Naren Kodali) ప్యానెల్ కి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా గత నాలుగు వారాలుగా అమెరికాలో పలు ముఖ్య పట్టణాలలో సుడిగాలి పర్యటన చేసి నరేన్ కొడాలి ప్యానెల్ కి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఇప్పటివరకు ఇద్దరు తానా మాజీ అధ్యక్షులు టీం కొడాలి కి బహిరంగ మద్దతు ప్రకటించినట్లైంది.
తానా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేసిన కొన్ని వందల కార్యక్రమాలలో అంజయ్య చౌదరి గారితో భాగస్వామ్యులు అయిన చాలా మంది సభ్యులు ఇప్పుడు నరేన్ కొడాలి ప్యానెల్ లో పోటీ చేస్తున్నారు. వ్యక్తుల ప్రయోజనాలు కన్నా సంస్థ ప్రయోజనాలు ముఖ్యం అని భావించే అంజయ్య చౌదరి లావు గారు దానికనుగుణంగా పనిచేసే వారికి మద్దతు తెలపవలసిన అవసరం ఎంతైనా వుంది అని భావించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతిష్టాత్మకమైన తానా (Telugu Association of North America) సంస్థ ను మరింత ముందుకు తీసుకు వెళ్లి అమెరికా, కెనడా మరియు ఇండియా లో తెలుగు వారికి మరిన్ని సేవలు అందించటానికి నరేన్ కొడాలి ప్యానెల్ మొత్తాన్ని అత్యంత మెజారిటీ తో గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు.