. గోల్డెన్ జూబిలీ అధ్యక్షునిగా నరేన్ కొడాలి . టీం కొడాలి ప్యానెల్ దాదాపు క్లీన్ స్వీప్ . ముందే చెప్పిన NRI2NRI.COM . 5 RR లు & 2 డోనార్ ట్రస్టీలు టీం వేమూరి కైవసం . ముచ్చటగా మూడోసారి ఎన్నికలు . ఒక సంవత్సర కాలం కాలగర్భంలో
అమెరికా అంతటా రెండు నెలల హోరాహోరీ ఎలక్షన్ క్యాంపైన్, తర్వాత సై అంటే సై అంటూ మూడు వారాల ఓట్ల పోలింగ్, చివరిగా ఈరోజు సియాటిల్ (Seattle) లో కౌంటింగ్. కట్ చేస్తే 2023-25 కాలానికి నరేన్ కొడాలి ప్యానెల్ (Naren Kodali Panel) కి పట్టం కట్టిన తానా ఓటర్లు.
వివరాలలోకి వెళితే… 2023-25 కాలానికి నిర్వహించిన మొదటి ఎలక్షన్స్ సమయలేమి కారణంగా రద్దవడం, రెండవసారి అందరూ కాంప్రమైజ్ అయ్యి సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఎన్నికయినప్పటికీ కోర్టు వాటిని రద్దు చేయడంతో రీసెంట్ గా ముచ్చటగా మూడోసారి తానా ఎన్నికలు (TANA Elections) నిర్వహించారు.
ఈ మొత్తం ప్రాసెస్ లో దాదాపు ఒక సంవత్సర కాలం కాలగర్భంలో కలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే తానా లో స్తబ్దత నెలకొంది. కోర్టు కేసులు, దూషణల పర్వం వంటి వాటిని దాటుకొని, ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో తానా సభ్యులు సైతం క్యాంపైన్ (Election Campaign) గోల తప్పిందంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇప్పటి వరకు తానా (Telugu Association of North America – TANA) చరిత్రలో ఎప్పుడూ నిర్వహించని, సవాలుతో కూడిన ఎలక్ట్రానిక్ వోటింగ్ (Electronic Voting) పద్దతిలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడంతో, ఫలితాలపై అమెరికాలోని తెలుగువారు కూడా ఒకింత కుతూహలం వ్యక్తం చేస్తూ వచ్చారు.
నరేన్ కొడాలి (Naren Kodali) సారధ్యంలోని టీం కొడాలి ప్యానెల్ మొదటి నుంచి చెప్తున్నట్టే క్లీన్ స్వీప్ చేసి పైచేయి సాధించింది. అందుకు విరుద్ధంగా సతీష్ వేమూరి (Sateesh Vemuri) సారధ్యంలోని టీం వేమూరి ప్యానెల్ ఎలక్ట్రానిక్ వోటింగ్ ద్వారా సైలెంట్ వోటింగ్ తో అద్భుతాలు జరుగుతాయని ఆశించి భంగపడింది.
20 వేలు కంటే ఎక్కువ ఓట్లు పాలైతే టీం కొడాలి (Team Kodali) ఫుల్ స్వీప్ చేస్తుందని NRI2NRI.COM ముందే చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అందరి అంచనాలకంటే ఎక్కువగా దాదాపు 23 వేల పైచిలుకు ఓట్లు పోలవ్వడం, NRI2NRI.COM చెప్పినట్టే టీం కొడాలి ప్యానెల్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఫలితాలపై పూర్తి విశ్లేషణ త్వరలో మరో ఆర్టికల్ లో…
విజేతల వివరాలు
Executive Committee:-
Executive Vice President: Naren Kodali Secretary: Raja Kasukurthi Treasurer: Bharath Maddineni Joint Secretary: Venkat Koganti Joint Treasurer: Sunil Pantra Community Service Coordinator: Lokesh Naidu Konidala Cultural Service Coordinator: Uma Katiki Women Services Coordinator: Sohini Ayinala Councilor at Large: Sateesh Kommana International Coordinator: Tagore Mallineni Sports Coordinator: Naga Panchumarthi