Connect with us

Elections

పలు మలుపుల అనంతరం 4 ఏళ్లకు ఒకసారి వచ్చే రోజున TANA ఎన్నికల తతంగం పూర్తి

Published

on

2023-25/27 కాలానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఎన్నికల ఫలితాలు ప్రకటించి దాదాపు నెలన్నర అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఓడిన వర్గం ఎలక్షన్ (Election) రిజల్ట్స్ ని ఛాలెంజ్ చేసిన తదనంతర పరిణామాలతో తానా లో ఒక రకమైన నిశ్శబ్దం నెలకొంది.

ఇక మళ్ళీ కోర్ట్ కేసులు తప్పవు అనుకుంటున్న సమయంలో నిన్న ఫిబ్రవరి 29న జరిగిన బోర్డ్‌ (TANA Board of Directors) సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చుతూ, కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల నియామకాలకు ఆమోదముద్ర వేసింది.

మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డ్‌, పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత/మాజీ తానా బోర్డ్‌ చైర్మన్‌ హనుమయ్య బండ్ల తానా సభ్యులకు పంపిన ఈమెయిల్ (Email) లో పేర్కొన్నారు. 29వ తేదీన బోర్డ్‌ సమావేశం జరిగిందని, అందులో ఎన్నికల ఓటింగ్‌ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి వాటిని తోసిపుచ్చామన్నారు.

ఎన్నికల కమిటీ (Election Committee) పంపిన రిజల్ట్‌ ను పరిగణలోకి తీసుకుంటూ, కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికు అధికారికంగా బోర్డ్‌ ఆమోదముద్ర వేసినట్లు హనుమయ్య బండ్ల తాను పంపిన ఈమెయిల్ లో తెలియజేశారు. బోర్డ్‌ ఆమోదముద్ర వేయడంతో తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా నరేన్‌ కొడాలి (Naren Kodali) తోపాటు ఆయన టీమ్‌ బాధ్యతలను చేపట్టినట్లయింది.

ఫిబ్రవరి 29న ఈ తతంగం అంతా ముగియడంతో, పలు మలుపుల అనంతరం 4 ఏళ్లకు ఒకసారి వచ్చే లీప్ ఇయర్ ఫిబ్రవరి 29న తానా ఎన్నికల కథ సుఖాంతం అయినట్లయింది. తానా నాయకులు ఇకనైనా స్థబ్దత తొలగించి సేవాకార్యక్రమాలను (Service Activities) తిరిగి గాటిలో పెట్టాల్సిందిగా తానా సభ్యులు కోరుతున్నారు.

విజేతల వివరాలు

Executive Committee:-

Executive Vice President: Naren Kodali
Secretary: Raja Kasukurthi
Treasurer: Bharath Maddineni
Joint Secretary: Venkat Koganti
Joint Treasurer: Sunil Pantra
Community Service Coordinator: Lokesh Naidu Konidala
Cultural Service Coordinator: Uma Katiki
Women Services Coordinator: Sohini Ayinala
Councilor at Large: Sateesh Kommana
International Coordinator: Tagore Mallineni
Sports Coordinator: Naga Panchumarthi

RR Southeast: Madhukar Yarlagadda
RR Appalachian: Rajesh Yarlagadda
RR New England: Krishna Prasad Sompally
RR North: Neelima Manne
RR North Central: Sriman Yarlagadda
RR Southern California: Hema Kumar Gotti
RR Northern California: Venkat Adusumalli
RR Northwest: Suresh Patibandla
RR Capitol: Sateesh Chinta
RR Mid Atlantic: Venkat Singu
RR Southwest: Sumanth Pusuluri
RR DFW: Paramesh Devineni
RR New Jersey: Ramakrishna Vasireddy
RR New York: Deepika Sammeta
RR Ohio Valley: Siva Chava
RR Midwest: Sriharsha Garikapati (Unanimous)
RR South Central: Emesh Chandra Gutta (Unanimous)
RR Rocky Mountains: Sekhar Kolla (Unanimous)

Board of Directors:-

Srinivas Lavu
Ravi Potluri
Mallikarjuna Vemana

Board of Director – Donor:-

Hema Kanuru (Unanimous)

Foundation Trustees:-

Ramakrishna Chowdary Allu
Bhakta Balla
Srinivas Kukatla
Raja Surapaneni
Srinivas Yenduri

Foundation Trustees – Donor:-

Suresh Puttagunta
Sridhar Gottipati

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected