Connect with us

Health

బంగారుపాళ్యం & చిత్తూరులో సునీల్ పంత్ర, మోహన్ ఈదర, హేమంత్ కూకట్ల సేవా కార్యక్రమాలు; తానా చైతన్య స్రవంతి

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ డిసెంబర్ 2 నుండి చైతన్య స్రవంతి కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఇందులో భాగంగా రాయలసీమలోని చిత్తూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంత్ర (Sunil Pantra), అట్లాంటా ప్రముఖ ఎన్నారై మోహన్ ఈదర (Mohan Eadara) మరియు ఆస్టిన్ టెక్సస్ ప్రముఖ ఎన్నారై హేమంత్ కూకట్ల (Hemanth Kukatla) ఈ రెండు చోట్లా నిర్వహించే సేవా కార్యక్రమాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

డిసెంబర్ 29 గురువారం ఉదయం 11 గంటల నుండి బంగారుపాళ్యంలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం (Mega Eye Camp) నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో నేత్ర పరీక్షలు, అవసరమైనవారికి కంటి ఆపరేషన్లు మరియు చిన్నలకు పెద్దలకు వినికిడి పరీక్షలు చేయనున్నారు.

రైతుకోసం తానా కార్యక్రమంలో భాగంగా రైతులకు స్ప్రేయర్లు మరియు రక్షణ కిట్లు అందిస్తారు. అలాగే తానా క్లీన్ అండ్ గ్రీన్ (Clean and Green) ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాలను భాష్యం వంశి మరియు భాష్యం మోహన్ నాయుడు సమన్వయం చేస్తున్నారు.

అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించే తానా కళోత్సవాల సభలో ఆదరణ స్వయం ఉపాధి పథకం కింద మహిళలకు కుట్టు మిషన్లు (Sewing Machines), పేద విద్యార్థులకు సైకిళ్ళు, పేద విద్యార్థులకు తానా చేయూత పథకం కింద ఉపకార వేతనాలు (Scholarships) అందజేస్తారు.

అలాగే రైతుకోసం తానా కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో కూడా రైతులకు స్ప్రేయర్లు మరియు రక్షణ కిట్లు (Safety Kits) అందిస్తారు. అందరూ ఆహ్వానితులే అంటూ తానా వారు బంగారుపాళ్యం మరియు చిత్తూరు (Chittor) ప్రాంత వాసులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected