Connect with us

Elections

TANA Elections: సతీష్ వేమూరి ప్యానెల్ ప్రచారం @ Houston, Texas

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ఎన్నికలలో (Elections) ప్రచారం ఉధృతంగా సాగుతుంది. సతీష్ వేమూరి సారధ్యంలోని టీం వేమూరి (Team Vemuri) మరియు నరేన్ కొడాలి సారధ్యంలోని టీం కొడాలి (Team Kodali) అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో పోటాపోటీగా పర్యటిస్తున్నారు.

ఇందులో భాగంగా గత వారాంతం సతీష్ వేమూరి ప్యానెల్ (Team Vemuri) సౌత్ వెస్ట్ రీజియన్ లోని హ్యూస్టన్ (Houston, Texas) నగరంలో తానా సభ్యులతో పరిచయ కార్యక్రమం పద్మశ్రీ ముత్యాల గారు, జై తాళ్లూరి గారు, రత్న ప్రసాద్ గుమ్మడి గారి ఆధ్వర్యంలో మురళి తాళ్లూరి, సుమంత్ పుసులూరి  నిర్వహించారు.

ఈ సందర్భంగా టీం వేమూరి తరపున సౌత్ వెస్ట్ రీజినల్ రిప్రజంటేటివ్ పదవికి పోటీచేస్తున్న సుమంత్ పుసులూరి (Sumanth Pusuluri) మాట్లాడుతూ.. తానా (Telugu Association of North America) సంస్థలో బాధ్యత వహించిన పదవులు అలాగే తను చేసిన సేవ కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్ధించారు.

భవిష్యత్తులో టీం వేమూరి నిర్వహించే కార్యక్రమాలు తానా (TANA) సంస్థకి మరియు సభ్యులకి ఎలా ఉపయోగపడతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో సతీష్ వేమూరి ప్యానెల్ కి మద్దతుగా సుమారు 150 మంది తానా (TANA) సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొనటం జరిగినది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected