Connect with us

Politics

కోడెల శివరాం సమక్షంలో NTR & Kodela జయంతి: NRI TDP Ireland

Published

on

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి మరియు పలనాటి పులి డా.కోడెల శివప్రసాద రావు 75 వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ యూరప్ – ఐర్లాండ్ విభాగం సభ్యుల ఆధ్వర్యంలో డబ్లిన్ నగరం లో సమావేశం కాగా ముఖ్య అతిధిగా డా. కోడెల శివరాం గారు హాజరయ్యారు.

ఆ సంధర్బంగా సభ్యులు ఎన్టీఆర్ (NTR) మరియు కోడెల మధుర స్మృతులు, వారు జన్మభూమికి అందించిన సేవలు జ్ఞప్తి చేసుకొని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించి ముఖ్య అతిథితో సభ్యులు ఇష్టా గోష్ఠి నిర్వహించి వారి తండ్రి వలే డా.శివరాం కూడా ప్రజాసేవ చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

తదనంతరం కోడెల (Kodela Siva Prasada Rao) కలల పంట కోటప్పకొండ మరియు ప్రభ యొక్క ప్రతిమను డా. కోడెల శివరాం కు బహుకరించారు. తదుపరి పసందైన విందుతో ముగించి కార్యక్రమం విజయవంతం చేసారు.

ఈ సమావేశానికి ఎన్నారై టీడీపీ రీజినల్ కోఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని, ప్రెసిడెంట్ భాష్యం భరత్ ఆధ్వర్యంలో తెలుగు మహిళా నాయకురాలు దీప్తి, హిమజ, జ్యోతి జ్యోతిర్మయి జ్యోతి ప్రజ్వలన చేయగా వెంకట కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, శివ వేములపల్లి సభాధ్యక్షత వహించారు.

NRI TDP Ireland ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, రాజేష్ పల్లేటి,జగన్ ముత్తుముల, ప్రసాద్ కొణిదల, నరేంద్ర ముప్పాళ్ల, అరుణ్, కృష్ణ మందల, కిషోర్ కొత్తపల్లి, కోటెన్ద్ర, రామ్ వంగవోలు తదితర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected