Connect with us

News

కూటమి గెలుపుతో అంతులేని ఆనందంతో ప్రవాసాంధ్రుల సంబరాలు @ Washington DC

Published

on

. వాషింగ్టన్ డీసీలో 500 కార్లతో భారీ ప్రదర్శన
. కూటమి గెలుపుతో అమెరికా రాజధానిలో ప్రవాసాంధ్రుల సంబరాలు
. ఆన్ లైన్ లో మాట్లాడిన పెమ్మసాని, సుజన
. అంతులేని ఆనందంతో జండాలు పట్టి కేరింతలు

Washington DC: ఏపీ (Andhra Pradesh) లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు… మంత్రులు బాధ్యతలు స్వీకరించడం పట్ల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మూడు పార్టీల జెండాలు చేతబూని… ఎన్డీఏకు అనుకూలంగా నినాదాలు చేశారు.

500 కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Dr. Chandra Sekhar Pemmasani), శాసనసభ్యులు సుజనా చౌదరి, రోషన్ కుమార్, సుందరపు విజయ్ కుమార్, ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ అఖండ విజయంలో భాగస్వాములైన ఎన్ఆర్ఐలకు అభినందనలు. అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులందరూ జన్మభూమికి వచ్చి కూటమి (National Democratic Alliance – NDA) విజయంలో పాలుపంచుకున్నారన్నారు.

సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టడంలో ప్రవాసాంధ్రులు (NRI’s) తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. రాష్ట్రాభివృద్ధిలోనూ ఎన్ఆర్ఐలు కీలకపాత్ర పోషించాలన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ (NRI TDP USA) కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ.. ఓటర్లు చూపిన విజ్ఞత, ప్రజ్ఞ, చైతన్యం వల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యపడింది అని అన్నారు.

సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులకు, హంతకులకు, అరాచక శక్తులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కూటమిగా ఏర్పడటం, మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మించగలుగుతారనే విశ్వాసం గెలుపునకు పునాది. రాష్ట్రాభివృద్ధి కోసం భవిష్యత్ లోనూ ఎన్ఆర్ఐలు తమ సహాయసహకారాలను కొనసాగించాలన్నారు.

తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. జగన్ రెడ్డి లాంటి ఉన్మాదులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక. టీడీపీ (Telugu Desam Party) విజయంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. కూటమి చారిత్రక విజయం సాధించింది. ప్రవాసాంధ్రుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏపీలో కంటే మిన్నగా తమ ఆనందాన్ని, హర్షాన్ని పంచుకున్నారు.

ఈ Washington DC సభా కార్యక్రమాన్ని భాను మాగులూరి (Bhanu Maguluri) సమన్వయ పరిచారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, విజయ్ గుడిసేవ, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, వేణు పులిగుజ్జు, అనిల్ ఉప్పలపాటి, త్రిలోక్ తదితరులు ప్రసంగించి సభికులను ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో నరేన్ కొడాలి, చంద్ర బేవర, శ్రీరామ్ తనికెళ్ల, ప్రవీణ్ దాసరి, చౌదరి యలమంచిలి, సతీష్ చింత, రాజేష్ కాసరనేని, రవి అడుసుమిల్లి, రమేష్ గుత్తా, సాయిసుధ పాలడుగు, మంజూష గోరంట్ల, శుభ ఎర్రంశెట్టి, రాధికా రామాయణం, సురేఖ చనుమోలు, సంజయ్ నాయుడు, కృష్ణ గుడిపాటి, యువ సిద్ధార్థ్ బోయపాటి, సమంత, మురళి, వినీల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected