Connect with us

College

డాక్టర్ చదవాలనుకునే విద్యార్ధులకు MCAT Test పై దిశా నిర్థేశం: NATS

Published

on

అమెరికాలో డాక్టర్ చదవాలనుకునే విద్యార్ధులకు అత్యంత కీలకమైన ఎంక్యాట్‌ (MCAT Test) పై నాట్స్ అవగాహన కల్పించింది. ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సు మెడికల్ చదవాలనుకునే విద్యార్ధులకు దిశా నిర్థేశం చేసింది. ఎంక్యాట్‌ (MCAT Test) లో అత్యుత్తమ మార్కులు సాధించిన తెలుగు విద్యార్థి శ్రీచరణ్ మంచికలపూడి తన విజయానికి బాటలు వేసిన మార్గాలను వివరించారు.

ఎంక్యాట్‌కు ఎలా సన్నద్ధం కావాలి..? ఏయే అంశాల మీద పట్టు సాధించాలి..? అందుకు అవలంబించాల్సిన మార్గాలేమిటి.? ఏ అంశాలను ఎలా నేర్చుకోవాలి.? ఎంక్యాట్‌ (MCAT Test) లో అత్యుత్తమ మార్కుల కోసం ఎలా కృషి చేయాలి.? ఇలాంటి ఎన్నో అంశాలను శ్రీచరణ్ మంచికలపూడి చక్కగా వివరించారు.

ముందుగా ఈ సదస్సులో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) వివరించారు. ఈ సదస్సుకు సంకీర్త్ కటకం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆన్‌లైన్ ద్వారా విద్యార్ధులకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీచరణ్ మంచికలపూడికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected