ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఫ్లోరిడా లోని టాంపా బే లో సరికొత్త కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వహించింది. తెలుగువారు ఎంతో మంది అమెరికాలో చిన్నచిన్న సంస్థలు స్థాపించి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఇలాంటి వారి కోసం అక్కడి ప్రభుత్వం నుంచి లభించే మద్దతు ఎలా ఉంటుంది? ప్రభుత్వ విధానాలు ఏమిటి? ఎలా నడుచుకుంటే యజమానులు, యాజమాన్యాలు ఎక్కువ లబ్ధి పొందవచ్చు అనే అంశాలపై వెబినార్ నిర్వహించింది.
టాంపా బే లో ప్రభుత్వ పాలసీ అయిన ఇమేజ్‌పై (ప్రభుత్వం, యాజమనుల మధ్య ఐసీఈ పరస్పర ఒప్పందం) ఈ వెబినార్‌లో అవగాహన కల్పించడం జరిగింది. డిఫార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మద్దతుతో నాట్స్ టాంపా బే విభాగం ఈ వెబినార్ నిర్వహించింది. ఇమేజ్ ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ మార్క్ వ్యాన్‌ధన్‌బర్గ్ ప్రభుత్వం చేపట్టిన ఇమేజ్ కార్యక్రమం గురించి వివరించారు. కంపెనీల్లో ఆడిటింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. యాజమాన్యాలు ప్రభుత్వంతో సత్సంబంధాలు కోసం ఎలా వ్యవహారించాలి, I-9ని ఎలా నిర్వహించాలి, అకౌంటింగ్ విషయాల్లో స్పష్టత ఎలా ఉండాలనే దానిపై మార్క్ తెలిపారు. ప్రభుత్వ ఆడిట్ అంటే భయం లేకుండా నిర్భయంగా ఉండేందుకు దాని మీద స్పష్టమైన అవగాహన ఎంతో ముఖ్యమని మార్క్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం తాము ఉచిత శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు.
నాట్స్ నిర్వహించిన ఈ వెబినార్‌లో దాదాపు 100 మందికి పైగా పాల్గొని ఇమేజ్ ప్రొగ్రామ్ పై అవగాహన పెంచుకున్నారు. తమ సందేహాలను ఇమేజ్ ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ మార్క్ ని అడిగి నివృత్తి చేసుకున్నారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ , రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టాంపా బే చాప్టర్ కోఆర్డినేటర్ ప్రసాద్ అరికట్ల, జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జతో పాటు నాట్స్ వాలంటీర్లు ఈ వెబినార్ విజయవంతం కావడానికి కృషి చేశారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ శేఖర్ అన్నే తో పాటు నాట్స్ నాయకులు రవి గుమ్ముడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, రవి మేడిచర్లకు నాట్స్ టాంపా బే విభాగం ధన్యవాదాలు తెలిపింది.