Connect with us

Politics

తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం @ Charlotte, North Carolina

Published

on

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టిడి జనార్ధన్‌, గాలి భాను ప్రకాశ్‌, పులివర్తి నాని, ముళ్ళపూడి బాపిరాజు, డా. రవి వేమూరు అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరు ఈ మధ్యనే ఫిలడెల్ఫియాలో నిర్వహించిన తానా 23వ మహాసభలలో కూడా పాల్గొన్నారు.

వీరితో నార్త్ కరోలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నారైలు కూడా కృషి చేయాలని కోరారు.

చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం ఖాయమని, ఈ మేరకు తాను టీడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కు మాట కూడా ఇచ్చానని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు టి.డి. జనార్ధన్‌ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఘనంగా జరుపుతున్నట్లు చెప్పారు.

నగరి నియోజకవర్గానికి చెందిన గాలి భానుప్రకాశ్‌ మాట్లాడుతూ.. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు నగరి నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో ఈసారి నగరిలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని చెప్పారు.

పశ్చిమగోదావరికి చెందిన ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ (YS Jagan Mohan Reddy) పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, దౌర్జన్యాలను చూసి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ని గెలిపించడం ఖాయమని చెప్పారు.

ఎన్నారై టీడీపీ నాయకుడు, ఎపిఎన్‌ఆర్‌టీ మాజీ చైర్మన్‌ రవి వేమూరు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో కూడా ఎన్నారై టీడీపి (NRI TDP) నాయకులు, కార్యకర్తలు ముందుగానే ప్రచారంలోకి దిగితే మరిన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు.

చార్లెట్లో ఉన్న టీడీపీ నాయకులు రమేష్‌ మూకుళ్ళ, నాగ పంచుమర్తి, బాలాజి తాతినేని, సతీష్‌ నాగభైరవ, ఠాగూర్‌ మల్లినేని, తులసీరాం పాశం, దేవ నర్రావుల , మాధురి ఏలూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. నార్త్ కరోలినా రాష్టం, చార్లెట్ మరియు ర్యాలీ నగరాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected