అమెరికా పర్యటనలో వివిధ నగరాలలో ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీట్ & గ్రీట్ కార్యక్రమాలలో డా. కోడెల శివరామ్ (Dr. Kodela Sivaram) పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం 15 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి తారక రామారావు గారికి మరియు కోడెల శివప్రసాదరావు గారికి వాషింగ్టన్ డీసీ (Washington DC) లో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డా. కోడెల శివరామ్ (Dr. Kodela Sivaram) మాట్లాడుతూ… ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలిచి ఇంతవరకు గెలవని మంగళగిరి నియోజకవర్గం (Mangalagiri Assembly Constituency) లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి కార్యకర్తల మనోదైర్యాన్ని పెంచిన నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) గారు అన్నారు.
కార్యకర్తల సంక్షేమ సమన్వయకర్తగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవిష్యత్ నిర్దేషుకుడిగా నమ్మకంతో రిలయన్స్ పెట్టుబడులు పెడుతుంది. ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్లు, ఐటీ సెజ్ ఇలా ఎన్నో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు, నారా లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి నాయకత్వం వల్లే సాధ్యమైంది అన్నారు.
నందమూరి తారక రామారావు (NTR) మరియు కోడెల శివప్రసాదరావు (Kodela Siva Prasada Rao) తెలుగు వారి గుండెల్లో చిరస్థానం సంపాదించిన నాయకులు. వారిరువురికీ అభిమానులు కాదు ఆరాధించే వాళ్ళు మాత్రమే ఉంటారు. వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి ద్వారా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవులుగా మిగిలిపోయారని కొనియాడారు.
అలాగే ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత కూడా సినీ జీవితాన్ని వదిలి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన అన్న (NTR) గారి అడుగుజాడల్లో రూపాయి డాక్టర్ గా కీర్తి ప్రతిష్టలు గడించిన తర్వాత కూడా సమాజానికి ఏం ఇవ్వగలం అని వచ్చిన వ్యక్తి కోడెల (Kodela Siva Prasada Rao) గారని అన్నారు.
అన్నగారు ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా రాజకీయాలకి ఎట్లా రూపురేఖలు మార్చారో అలాగే కోడెల శివప్రసాదరావు గారు నరసరావుపేట (Narasaraopeta), సత్తెనపల్లి (Sattenapalle) నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి, పల్నాడులో ఆయన చేసిన పోరాటం ద్వారా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారన్నారు.
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం GWTCS వారు, తానా అధ్యక్షులు నరేన్ కోడాలి (Naren Kodali) గారు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana) గారు, నాగేశ్వరావు నల్లూరి గారు, మన్నవ సుబ్బారావుగారు, రవి అడుసుమిల్లి, కృష్ణ లామ్, యశస్వి బొద్దులూరి, సాయి బొల్లినేని, భాను మాగులూరి, మురళి, ఈశ్వరరావు, శ్రీరామ్, సుధీర్ కొమ్మి మరియు NRI TDP సభ్యులను డా. కోడెల శివరామ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టిడిపి (NRI TDP Washington DC) నాయకులు డా. కోడెల శివరామ్ ని ఘనంగా సన్మానించారు. అనంతరం తానా, కిరాక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ గాయని పద్మశ్రీ శ్రీమతి చిత్ర (Krishnan Nair Shantakumari Chithra) గారిని డా. కోడెల శివరామ్ సన్మానించారు.