Connect with us

Politics

RRR @ Charlotte: జగన్ ని రాక్షసుడు అంటే రాక్షస జాతి సిగ్గుపడేలా ఉంది

Published

on

అమెరికా పర్యటనలో భాగంగా కనుమూరు రఘు రామ కృష్ణ రాజు (RRR) నార్త్‌ కెరొలినా రాష్ట్రం ఛార్లెట్‌ (Charlotte) లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు రఘు రామ కృష్ణ రాజు తో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

వర్కింగ్ డే అయినప్పటికి దాదాపు 200 మంది ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఠాగూర్‌ మల్లినేని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముఖ్య అతిథి రఘు రామ కృష్ణ రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) ను నాగ పంచుమర్తి సభకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా కనుమూరు రఘు రామ కృష్ణ రాజు (RRR) ని ఘనంగా సత్కరించారు. నాగ పంచుమర్తి, ఠాగూర్‌ మల్లినేని, బాలాజి తాతినేని, సతీష్‌ నాగభైరవ, శ్రీమాన్ రావి, సురేష్ కొత్తపల్లి తదితరులు ఈ Meet & Greet కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.

ఈ సమావేశంలో కనుమూరు రఘు రామ కృష్ణ రాజు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ (YS Jagan Mohan Reddy) కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. అలాగే జగన్ ని రాక్షసుడు అంటే రాక్షస జాతి సిగ్గుపడేలా తయారయ్యాడని అన్నారు. భోజన అనంతరం అందరికీ కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

కనుమూరు రఘు రామ కృష్ణ రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) ఆత్మీయ సమావేశానికి సంబంధించి మరిన్ని ఫోటోలకు www.NRI2NRI.com/RRR in Charlotte North Carolina ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected