Connect with us

News

కాంతితో క్రాంతి @ US Capital Washington DC

Published

on

ఆంధ్రరాష్ట్రంలో నెలకొన్న నాటకీయ రాజకీయ పరిణామాలను, నారా చంద్రబాబు నాయుడు పట్ల అవలంబిస్తున్న కక్షపూరిత, అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ అక్టోబర్ 7న ప్రవాస భారతీయులు కాంతితో క్రాంతి అనే కాండిల్ రాలీ (Candlelight Rally) ని నిర్వహించారు.

చీకటిని చీల్చుకుని వెలుగుతున్న ఈ దీపాలే రేపటి రోజు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి వెలుగు రేఖలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి సమన్వయపరచారు.

ముఖ్యంగా మహిళలు మాట్లాడుతూ.. చంద్రబాబు పట్ల ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈనాటి ప్రభుత్వం (YSRCP Government) ప్రజా వేదిక కూల్చటం దగ్గర్నుండి నుండి మొదలై, నేడు కక్ష సాధించటం, ప్రతిపక్షంపై నిరాధార కేసు లు పెట్టటం తప్పించి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నైనా చేయగలుగుతుందా అని ప్రశ్నించారు.

అప్పుల బటన్ నొక్కటానికి ముఖ్యమంత్రి (Chief Minister) పదవి అవసరమా, అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వటం కంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అవమానం ఏముంటుంది అని ప్రశ్నించారు. యువత, మహిళల భవితను తాకట్టు పెట్టి, అభివృద్ధి ఆనవాలులేని రాష్ట్రంగా తయారు చేశారన్నారు.

చంద్రబాబు పాలనలో ఉమ్మడి స్వర్ణాంధ్ర నుండి నిన్నటి విభజిత నవ్యఆంధ్ర వరకూ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రగతికి, అభివృద్ధికి చిరునామాగా నిలిచామన్నారు. పక్క రాష్ట్రాలు అంతకంతకూ ఎదుగుతుంటే ప్రస్తుత పాలకులు మన రాష్ట్రాన్ని అవివేకంతో,అసమర్ధ పాలనతో దిగజార్చారన్నారు. ప్రజలు ఆలోచించాల, మేల్కొనాలి. తిరిగి సమర్ధ నాయకుని చేతికి రాష్ట్ర పాలన అందించాలి అని, జై చంద్రబాబు అని నినదించారు.

ఈ కాంతితో క్రాంతి కాండిల్ రాలీ కార్యక్రమంలో నీలిమ చనమోలు, సురేఖ చనమోలు, రమేష్ గుత్తా, వీర నారాయణ, నెహ్రు, గోపాల్ శీలంనేని,రమేష్ అవిర్నేని, దుర్గాప్రసాద్ కూచిపూడి,చకవర్తి, సురేష్, అమ్మిరాజు, రామకృష్ణ, యువ సిద్ధార్థ్, సామంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected