Connect with us

Education

మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్‌పై అవగాహన సదస్సు: NATS, Telugu Association of Florida

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ డాక్టర్లు కావాలనుకునే విద్యార్ధుల కోసం మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ ఫ్లోరిడా, టెంపా బే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 23న తెలుగు అసోషియేషన్ ఆఫ్ ప్లోరిడా (Telugu Association of Florida) సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించాయి.

ప్లోరిడాలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సదస్సు జరిగింది. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (University of South Florida) లో అసోసియేట్ డీన్, అడ్మిషన్స్ ఎండీ డాక్టర్ ఎడ్వింగ్ డేనియల్, యుఎస్ఎఫ్‌లోని తనేజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ కుమార్ పంగులూరి ఈ సదస్సులో ఎన్నో విలువైన విషయాలను వివరించారు.

డాక్టర్ శివ కుమార్ పంగలూరి ఈ సదస్సుకు వ్యాఖ్యతగా వ్యవహారించారు. దాదాపు 100 మందికి పైగా ఈ సదస్సుకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. దాదాపు ఐదు వందల మందికి పైగా పరోక్షంగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సు అనంతరం విద్యార్ధులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు డేనియల్, శివకుమార్‌లు సమాధానాలు ఇచ్చారు.

మెడికల్ అడ్మిషన్ల పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఇంత చక్కటి కార్యక్రమానికి వేదికను ఇచ్చినందుకు అయ్యప్పస్వామి ఆలయ నిర్వాహకులకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ టెంపా బే (NATS Tampa Bay) విభాగం ఈ సదస్సును పక్కా ప్రణాళికతో నిర్వహించి విజయవంతం చేసింది.

ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti), నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డు సభ్యులు కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashanth Pinnamaneni), బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాదికి నాట్స్ టెంపా బే విభాగం ధన్యవాదాలు తెలిపింది.

ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ చాప్టర్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, వాలంటీర్ హరి మండవ టీఏఎఫ్ కమిటీ నాయకులు డాక్టర్ రఘు జువ్వాడి, జగదీష్ తౌతం, బిందు బండ, రాజా పంపాటి, ప్రసాద్ కొసరాజు, అయ్యప్ప ఆలయ నాయకత్వ బృందం డాక్టర్ శ్రీకుమార్ చెల్లప్పన్, విజయ్ నారాయణస్వామి, వాలంటీర్లు సునీల్, బాలాజీ, దుష్యంత్ తదితరులు ఈ సదస్సు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సదస్సుకు బయట నుంచి సహకరించిన నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) (Bapaiah Chowdary Nuthi) నూతి, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ మురళి మేడిచెర్ల కి నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected